Share News

Terrorist Threats to Gautam Gambhir: చంపేస్తాం

ABN , Publish Date - Apr 25 , 2025 | 03:49 AM

భారత జట్టు కోచ్ గౌతమ్ గంభీర్‌కు ISIS మరియు కశ్మీర్ పేరిట బెదిరింపు లేఖలు అందాయి. పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన రోజే ఈ లేఖలు వచ్చి, గంభీర్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు

 Terrorist Threats to Gautam Gambhir: చంపేస్తాం

గంభీర్‌కు బెదిరింపు మెయిల్స్‌ న్యూఢిల్లీ: భారత జట్టు కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌కు బెదిరింపు లేఖలు వచ్చాయి. ‘ఐ కిల్‌ యూ’ అంటూ గంభీర్‌ ఈ-మెయిల్‌కు ఐసిస్‌, కశ్మీర్‌ పేరిట రెండు బెదిరింపు లేఖలు పంపారు. ఉగ్రవాదులు పహల్గాంలో పర్యాటకులపై దాడి చేసిన రోజే గంభీర్‌కు బెదిరింపు రావడం కలకలం రేపింది. దాంతో స్థానిక రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో గంభీర్‌ ఫిర్యాదు చేశాడు. వెంటనే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే అధికారికంగా కేసు నమోదు కాకున్నా..ఈ-మెయిల్‌ మూలాన్ని, పంపిన వారిని గుర్తించే పనిలో సైబర్‌ క్రైమ్‌ పోలీసులు నిమగ్నమయ్యారు. కాగా..బీజేపీ మాజీ ఎంపీ అయిన గంభీర్‌కు 2022లోనూ ఇలాంటి బెదిరింపే వచ్చింది. దాంతో అతడి కుటుంబానికి కట్టుదిట్టమైన భద్రత కల్పించారు.

Updated Date - Apr 25 , 2025 | 03:51 AM