India vs Pakistan match: పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడనని ముందే చెప్పా.. శిఖర్ ధవన్ వ్యాఖ్యలు
ABN , Publish Date - Jul 20 , 2025 | 08:22 AM
ప్రస్తుతం ఇంగ్లండ్ వేదికగా వరల్డ్ ఛాంపియన్‌షిప్ అఫ్ లెజెండ్స్ టోర్నీ జరుగుతోంది. ఈ టోర్నీలో పలు దేశాలకు చెందిన మాజీ క్రికెటర్లు ఆడుతున్నారు. టీమిండియాకు మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ నాయకత్వం వహిస్తున్నాడు. ఈ టోర్నీలో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఆదివారం పాకిస్థాన్, భారత్ మ్యాచ్ జరగాల్సి ఉంది.

పహల్గాం ఉగ్రదాడి తర్వాత బీసీసీఐ (BCCI) ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పాకిస్థాన్ జట్టుతో ఏ తరహా క్రికెట్‌నూ ఆడకూడదని నిర్ణయించుకున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం ఇంగ్లండ్ వేదికగా వరల్డ్ ఛాంపియన్‌షిప్ అఫ్ లెజెండ్స్ (WCL 2025) టోర్నీ జరుగుతోంది. ఈ టోర్నీలో పలు దేశాలకు చెందిన మాజీ క్రికెటర్లు ఆడుతున్నారు. టీమిండియాకు మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh) నాయకత్వం వహిస్తున్నాడు. ఈ టోర్నీలో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఆదివారం పాకిస్థాన్, భారత్ మ్యాచ్ (India vs Pakistan) జరగాల్సి ఉంది.
పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడకూడదని భారత మాజీ క్రికెటర్లు నిర్ణయించుకోవడంతో ఆదివారం జరగాల్సిన మ్యాచ్‌ను డబ్ల్యూసీఎల్ రద్దు చేసింది. ఎడ్జ్‌బాస్టన్ స్టేడియం వద్దకు అభిమానులు ఎవరూ రావొద్దని, టికెట్ డబ్బులను పూర్తిగా రీఫండ్ చేస్తామని ఓ ప్రకటనలో నిర్వాహకులు తెలిపారు. దీంతో ఈ టోర్నీలో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించబోతున్నట్టు సమాచారం. కాగా, ఈ మ్యాచ్‌లో తాను ఆడేది లేదని మే 11వ తేదీనే నిర్వాహకులకు చెప్పినట్టు మాజీ క్రికెటర్ శిఖర్ ధవన్ (Shikar Dhawan) తెలిపాడు.
'డబ్ల్యూసీఎల్ లీగ్‌లో పాకిస్థాన్‌తో జరగాల్సిన మ్యాచ్‌లో ఆడకూడదని నేను గతంలోనే నిర్ణయించుకున్నా. ఈ మేరకు మే 11వ తేదీన డబ్ల్యూసీఎల్ నిర్వాహకులకు నా నిర్ణయాన్ని తెలిపాను. ఇప్పటికీ అదే నిర్ణయానికి కట్టుబడి ఉన్నాను. నాకు నా దేశమే ముఖ్యం. మాతృదేశం కంటే ఏదీ ఎక్కువ కాదు. జై హింద్' అంటూ శిఖర్ ధవన్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్లందరూ ఈ మ్యాచ్ ఆడడంపై విముఖత వ్యక్తం చేయడంతో మ్యాచ్ రద్దయింది.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి