Share News

Virat Kohli: విరాట్ కోహ్లీకి రీప్లేస్‌మెంట్ అంత సులభంగా జరగదు: సౌరవ్ గంగూలీ

ABN , Publish Date - Jun 22 , 2025 | 10:20 AM

పరుగుల యంత్రం, కింగ్ విరాట్ కోహ్లీ అనూహ్యంగా టెస్ట్‌ క్రికెట్ నుంచి వీడ్కోలు పలికాడు. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు ముందు కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించడం చాలా మందికి షాక్ కలిగించింది. కోహ్లీలాంటి దిగ్గజం లేకపోవడం టీమిండియాకు చాలా కష్టమని మాజీలు అభిప్రాయపడ్డారు.

Virat Kohli: విరాట్ కోహ్లీకి రీప్లేస్‌మెంట్ అంత సులభంగా జరగదు: సౌరవ్ గంగూలీ
Virat Kohli

పరుగుల యంత్రం, కింగ్ విరాట్ కోహ్లీ (Virat Kohli) అనూహ్యంగా టెస్ట్‌ క్రికెట్ నుంచి వీడ్కోలు పలికాడు. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు ముందు కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించడం చాలా మందికి షాక్ కలిగించింది. కోహ్లీ లాంటి దిగ్గజం లేకపోవడం టీమిండియాకు చాలా కష్టమని మాజీలు అభిప్రాయపడ్డారు. దాదాపు ఇదే అభిప్రాయాన్ని టీమిండియా మాజీ లెజెండ్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) కూడా వ్యక్తపరిచాడు. కోహ్లీ లాంటి ఆటగాడు మరొకరు దొరకడానికి టైమ్ పడుతుందని అభిప్రాయపడ్డాడు (ENG vs IND).


'కోహ్లీ క్లాస్ ప్లేయర్. ఎలాంటి పరిస్థితుల్లోనైనా పరుగులు చేసే సామర్థ్యం అతడికి ఉంది. అతడు లేకపోవడం కచ్చితంగా టీమిండియాకు లోటే. కోహ్లీకి రీప్లేస్‌మెంట్ అంత సులభంగా జరగదు. కొద్దిగా సమయం పడుతుంది. అయితే ఇంగ్లండ్‌లో శుభ్‌మన్ గిల్ (Shubman Gill) ఆడిన తీరు నన్ను ఆకట్టుకుంది. విదేశీ గడ్డపై గిల్ పాదాల కదలిక చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. అతడు అదే ఫుట్‌వర్క్‌తో ఆడితే కోహ్లీలాగానే టన్నుల కొద్దీ పరుగులు చేయగలడు. ఇంగ్లండ్‌తో ఆడిన ఇన్నింగ్స్‌లో గిల్ ఒక్క తప్పు కూడా చేయలేదు' అని సౌరవ్ గంగూలీ వ్యాఖ్యానించాడు.


గిల్ శాశ్వతంగా ఇదే ఫుట్‌వర్క్‌ను కొనసాగిస్తే అతడి సగటు 40-45 వరకు పెరుగుతుందని, టన్నుల కొద్దీ పరుగులు చేస్తాడని గంగూలీ అన్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 227 బంతుల్లో 19 ఫోర్లు, సిక్స్‌తో 147 పరుగులు చేశాడు. గిల్‌తో పాటు వికెట్ కీపర్ రిషభ్ పంత్ 178 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్స్‌లతో 134 శతకం సాధించాడు. ఇక, మొదటి రోజు ఓపెనర్ యశస్వి జైస్వాల్ (101) కూడా సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే.


ఇవీ చదవండి:

పట్టువదలొద్దు.. టీమిండియాకు ఇలాంటి అవకాశం మళ్లీ రాదు: సౌరవ్ గంగూలీ

సెంచరీ తర్వాత గాల్లో పల్టీలు

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 22 , 2025 | 10:20 AM