Sourav Ganguly: పట్టువదలొద్దు.. టీమిండియాకు ఇలాంటి అవకాశం మళ్లీ రాదు: సౌరవ్ గంగూలీ
ABN , Publish Date - Jun 22 , 2025 | 08:45 AM
ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా మంచి ఆరంభాన్ని దుర్వినియోగం చేసుకుంది. తొలి రోజు సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా రెండో రోజు అటు బ్యాటింగ్, ఇటు ఫీల్డింగ్ విభాగాల్లో తడబడింది.

ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా మంచి ఆరంభాన్ని దుర్వినియోగం చేసుకుంది (ENG vs IND). తొలి రోజు సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా రెండో రోజు అటు బ్యాటింగ్, ఇటు ఫీల్డింగ్ విభాగాల్లో తడబడింది. ఓవర్‌నైట్ స్కోరు 359/3తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 471 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ కూడా దీటుగానే బదులిస్తోంది.
ఒకవైపు బుమ్రా పదునైన బౌలింగ్‌తో ఇంగ్లండ్ బ్యాటర్లకు పరీక్ష పెడుతున్నా మరో ఎండ్‌లో ప్రిసిద్ధ్ కృష్ణ, సిరాజ్ అదే ఒత్తిడిని కొనసాగించలేకపోయారు. దీనికి తోడు ఫీల్డర్లు క్యాచ్‌లు వదిలేయడం కూడా ఇంగ్లండ్‌కు కలిసొచ్చింది. దీంతో ఇంగ్లండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 209/3తో పటిష్ట స్థితిలో నిలిచింది. టీమిండియా మెరుగైన స్థితి నుంచి ఇలాంటి పరిస్థితికి రావడంపై మాజీ ఆటగాడు సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. కెప్టెన్ గిల్, కోచ్ గంభీర్ స్ట్రాటీజీని ప్రశ్నించాడు. లీడ్స్‌లో ఇలాంటి అవకాశం మళ్లీ రాదని హెచ్చరించాడు.
'తొలి టెస్ట్‌ను టీమిండియా అద్భుతంగా ప్రారంభించింది. హెడింగ్లే పిచ్ ఇంత డ్రైగా ఉండడం ఇదే తొలిసారి. ఒకవేళ టీమిండియా 600 సాధించినట్టైతే మెరుగైన స్థితిలో ఉండేది. మంచి అవకాశాన్ని జారవిడిచారు. లీడ్స్‌లో ఇలాంటి అవకాశం టీమిండియాకు మళ్లీ రాకపోవచ్చు. గిల్, గంభీర్ సెలక్షన్ విషయంలో కూడా తప్పులు చేశారు. ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో అర్ష్‌దీప్ సింగ్‌ను తీసుకుంటే బాగుండేది. అర్ష్‌దీప్ యాంగిల్, వేగంతో ఇంగ్లండ్ బ్యాటర్లు ఇబ్బందిపడేవారు' అని గంగూలీ అభిప్రాయపడ్డాడు.
ఇవీ చదవండి:
41 పరుగుల గ్యాప్‌లో 7 వికెట్లు
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి