Chris Woakes: పేసర్ వోక్స్ అవుట్
ABN , Publish Date - Aug 02 , 2025 | 03:59 AM
భారత్‌తో జరుగుతున్న ఐదో టెస్టుకు ఇంగ్లండ్ పేసర్ క్రిస్ వోక్స్ గాయంతో దూరమయ్యాడు. తొలి రోజు లాంగ్

లండన్: భారత్‌తో జరుగుతున్న ఐదో టెస్టుకు ఇంగ్లండ్ పేసర్ క్రిస్ వోక్స్ గాయంతో దూరమయ్యాడు. తొలి రోజు లాంగ్ ఆఫ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న వోక్స్... కరుణ్ నాయర్ కొట్టిన బంతిని ఆపే ప్రయత్నంలో డైవ్ చేశాడు. అయితే ఈ క్రమంలో తన శరీర బరువంతా ఎడమ భుజంపై పడడంతో గాయమైంది. స్కానింగ్‌లో భుజం ఎముక స్థానభ్రంశం అయినట్టు తేలింది. దీంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో అతడు బ్యాటింగ్‌కూ దూరమయ్యాడు. బౌలింగ్‌లోనూ జట్టుకు టంగ్, ఒవర్టన్, అట్కిన్సన్‌లపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇవి కూడా చదవండి
ఇలా ఇన్వెస్ట్ చేయండి..రెండేళ్లలోనే రూ. 10 లక్షలు పొందండి..
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి