Novak Djokovic: జొకో 16వ సారి..
ABN , Publish Date - Jul 08 , 2025 | 03:14 AM
ఏడుసార్లు చాంపియన్ నొవాక్ జొకోవిచ్ వింబుల్డన్ క్వార్టర్‌ఫైనల్లో అడుగుపెట్టాడు.

క్వార్టర్‌ఫైనల్లో ప్రవేశం వింబుల్డన్
లండన్: ఏడుసార్లు చాంపియన్ నొవాక్ జొకోవిచ్ వింబుల్డన్ క్వార్టర్‌ఫైనల్లో అడుగుపెట్టాడు. సోమవారం జరిగిన ప్రీక్వార్టర్స్‌లో ఆరో సీడ్ జొకోవిచ్ 1-6, 6-4, 6-4, 6-4తో 11వ సీడ్ అలెక్స్ డిమినార్‌పై గెలిచాడు. ఈ వేదికపై జొకో క్వార్టర్స్ చేరడం ఇది 16వసారి. మరో ప్రీక్వార్టర్‌ఫైనల్లో 22వ సీడ్ కొబోలీ 6-4, 6-4, 6-7 (7), 7-6 (2)తో సిలిచ్‌కు చెక్ పెట్టాడు. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ప్రీక్వార్టర్‌ఫైనల్లో డిఫెండింగ్ చాంప్ అల్కారజ్ 6-7 (7), 6-3, 6-4, 6-4తో 14వ సీడ్ రుబ్లేవ్‌పై పోరాడి గెలిచాడు. మరో మ్యాచ్‌లో నోరీ 6-3, 7-6 (4), 6-7 (9), 6-7 (7), 6-3తో జారీని చిత్తు చేశాడు. మహిళల సింగిల్స్‌లో అన్‌సీడెడ్ బెలిండా బెన్సిక్ 7-6 (4), 6-4తో 18వ సీడ్ అలెగ్జాండ్రోవాకు షాకిచ్చి క్వార్టర్స్‌కు చేరింది. ఇతర రౌండ్-16 మ్యాచ్‌ల్లో 13వ సీడ్ అనిసిమోవా 6-2, 5-7, 6-4తో 30వ సీడ్ ఎన్‌సోకోవాపై, 19వ సీడ్ సంసనోవా 7-5, 7-5తో బౌజా్‌సపై విజయంతో ముందంజ వేశారు.
ప్రీక్వార్టర్స్‌లో భాంబ్రీ జోడీ ఓటమి: పురుషుల డబుల్స్‌లో భారత ఆటగాడు యుకీ భాంబ్రీ/రాబర్ట్ గాలోవే (అమెరికా) జోడీ జోరుకు ప్రీక్వార్టర్స్‌లో బ్రేక్ పడింది. రౌండ్-16 పోరులో స్పెయిన్, అర్జెంటీనా జంట గ్రానోలెర్స్/జెబలోస్ 6-4, 3-6, 7-6 (4)తో భాంబ్రీ ద్వయంపై నెగ్గింది. మిక్స్‌డ్ డబుల్స్ రౌండ్-16 మ్యాచ్‌లో భాంబ్రీ/జియాంగ్ (చైనా) జంట 6-7 (8), 3-6తో మార్సెలో (ఎల్‌సాల్వెడార్)/జాంగ్ (చైనా) జోడీ చేతిలో ఓటమి పాలైంది.