Share News

Mohit Sharma: ధోనీ నన్ను షరపోవా అనేవాడు

ABN , Publish Date - Apr 18 , 2025 | 02:59 AM

ధోనీ, మోహిత్ శర్మ బౌలింగ్‌ స్టైల్‌పై హాస్యంగా స్పందించాడు. బంతి టెన్నిస్‌ ప్లేయర్‌ తరహాలో గట్టిగా అరిచి బౌలింగ్ చేయడం ధోనీకి ఇష్టం ఉందని మోహిత్ వెల్లడించాడు

Mohit Sharma: ధోనీ నన్ను షరపోవా అనేవాడు

ముంబై: ధోనీ తనను షరపోవా అనేవాడని ఢిల్లీ క్యాపిటల్స్‌ పేసర్‌ మోహిత్‌ శర్మ గుర్తు చేసుకొన్నాడు. గతంలో మోహిత్‌ చెన్నైకి ఆడాడు. బంతి రిలీజ్‌ చేసే సమయంలో టెన్నిస్‌ ప్లేయర్‌ తరహాలో గట్టిగా హూంకరించడం అతడికి అలవాటు. ‘నేను బౌలింగ్‌ చేస్తున్నప్పుడు గట్టిగా అరిచే వాడిని. దీంతో ధోనీ నన్ను షరపోవా అంటూ ఆట పట్టించేవాడు. అలా చేస్తే నేనేదో గొప్ప వేగంతో బంతులేస్తున్నానని బ్యాటర్లు భ్రమపడే అవకాశం ఉంది. ఇది ఒకరకంగా నాకు లాభమే’ అని మోహిత్‌ చెప్పాడు. రెండో ఇన్నింగ్స్‌లో బంతి తడిస్తే మార్చడం.. బౌలర్లకు ప్రయోజనమేనని మోహిత్‌ అన్నాడు.

Updated Date - Apr 18 , 2025 | 03:00 AM