KL Rahul Cars: కేఎల్ రాహుల్ దగ్గర కోట్ల రూపాయల కార్లు
ABN , Publish Date - Apr 18 , 2025 | 11:55 AM
Cricketer KL Rahul Cars Collection: ప్రముఖ ఇండియన్ క్రికెటర్ కేఎల్ రాహుల్‌కు కార్లంటే పిచ్చి. ఆయన గ్యారేజీలో కోట్లు విలువు చేసే కార్లు చాలా ఉన్నాయి. దాదాపు నాలుగు కోట్ల రూపాయలు విలువ చేసే Aston Martin DB11 కారు కూడా ఆయన దగ్గర ఉంది.

కన్నూర్ లోకేష్ రాహుల్.. షార్ట్ కట్‌లో కేఎల్ రాహుల్. ఇండియన్ క్రికెట్ టీం ప్లేయర్‌గా ఆయనకంటూ ఓ మంచి గుర్తింపు ఉంది. బ్యాటర్‌గా, వికేట్ కీపర్‌గా అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్నారు. కేఎల్ రాహుల్‌కు క్రికెట్ అంటే పిచ్చి.. ఆ తర్వాత కార్లంటే పిచ్చి. అందుకే ఆయన గ్యారెజీలో కోట్లు విలువ చేసే అత్యంత ఖరీదైన కార్లను కొనిపెట్టుకున్నారు. వాటిలో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన బ్రాండ్ల కార్లు కూడా ఉన్నాయి. వాటి మొత్తం విలువ దాదాపు 20 కోట్ల రూపాయలు ఉంటుంది.
కేఎల్ రాహుల్ కార్ల కలెక్షన్
Mercedes-AMG C43 : జర్మనీకి చెందిన ఈ కారును దాదాపు 75 లక్షల రూపాయలు పెట్టి కొన్నారు. ఆయన మొదట కొన్న లగ్జరీ కారు ఇదేనని సమాచారం. సీ క్లాస్‌కు చెందిన ఈ కారు 3.0 లీటర్ల వీ6 ఇంజిన్‌ను కలిగి ఉంది. 4.7 సెకన్లలో 0 నుంచి 100 స్పీడు అందుకుంటుంది.
రేంజ్ రోవర్ వేలర్ : చాలా మంది సెలెబ్రిటీలలానే కేఎల్ రాహుల్ కూడా ఎంతో మోజుతో రేంజ్ రోవర్ కారును కొనుక్కున్నారు. ఈ కారు ఆన్ రోడ్ ధర ప్రస్తుతం కోటి రూపాయల వరకు ఉంది. ఈ కారు ఐదు లీటర్ల సూపరఛార్జ్‌డ్ వీ8 ఇంజిన్ కలిగి ఉంది.
BMW X7: ఈ కారులో డీజిల్, పెట్రోల్ వేరియంట్లు రెండూ ఉన్నాయి. డీజిల్ వేరియంట్ 265 హార్స్ పవర్ కలిగి ఉంటుంది. పెట్రోల్ వేరియంట్ 340 హార్స్ పవర్ కలిగి ఉంటుంది. ఈ రెండు వేరియంట్లలో 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అందుబాటులో ఉంది. ఇక, ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర 1.35 కోట్ల రూపాయలుగా ఉంది.
Audi R8: కేఎల్ రాహుల్ దగ్గర ఆడీ ఆర్8 కారు ఉంది. ఆ కారు ధర దాదాపు 2.72 కోట్ల రూపాయలుగా ఉంది. ప్రస్తుతం ఈ మోడల్ మార్కెట్‌లో అందుబాటులో లేదు. ప్రొడక్షన్ ఆగిపోయింది. ఈ కారు వీ10 ఇంజిన్ కలిగి ఉంది.
Aston Martin DB11: కేఎల్ రాహుల్ కార్ల కలెక్షన్లలో ఇదే అత్యంత ఖరీదైన కారు.. దీని ఎక్స్ షోరూము ధర 3.29 కోట్ల రూపాయలు. ఆన్ ధర 4 కోట్ల దాటే అవకాశం ఉంది. ఈ కారు ట్విన్ టర్బో ఛార్జ్‌డ్ వీ12 ఇంజిన్ కలిగి ఉంది.
ఇవి కూడా చదవండి
Outdoor Shoes: ఇంట్లోకి షూ వేసుకెళుతున్నారా.. అయితే, మీ ప్రాణాలు రిస్క్‌లో పడ్డట్టే..
Viral Video: నువ్వేమన్నా హీరో అనుకుంటున్నావా.. రోడ్డు మీద ఆ ఫోజ్ ఏంటి..