Share News

Chess World Cup: 23 ఏళ్ల తర్వాత భారత్‌లో చెస్ ప్రపంచకప్.. తేదీలు ఇవే..

ABN , Publish Date - Jul 21 , 2025 | 04:11 PM

చెస్ ప్రపంచకప్‌నకు చాలా ఏళ్ల తర్వాత భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. దాదాపు 23 ఏళ్ల తర్వాత ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఈ ఏడాది అక్టోబర్ 30 నుంచి నవంబర్ 27 వరకు జరగబోతోంది.

Chess World Cup: 23 ఏళ్ల తర్వాత భారత్‌లో చెస్ ప్రపంచకప్.. తేదీలు ఇవే..
India to host Chess World Cup

చెస్ ప్రపంచకప్‌ (Chess World Cup)నకు చాలా ఏళ్ల తర్వాత భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. దాదాపు 23 ఏళ్ల తర్వాత ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోంది (Chess World Cup in India). ఈ ఏడాది అక్టోబర్ 30 నుంచి నవంబర్ 27 వరకు చెస్ ప్రపంచకప్‌ భారత్‌లో జరగబోతోంది. ఈ విషయాన్ని అంతర్జాతీయ చెస్ సమాఖ్య (FIDE) ఈరోజు అధికారికంగా ప్రకటించింది. ఈ టోర్నీ పూర్తిగా నాకౌట్ ఫార్మాట్‌లో జరగబోతోంది.


ఈ మెగా టోర్నీలో మొత్తం 206 మంది చదరంగ క్రీడాకారులు పాల్గొనబోతున్నారు. మొత్తం 8 రౌండ్లు జరుగుతాయి. క్రీడాకారులు ప్రతి రౌండ్‌లో రెండు ఆటలు ఆడతారు. ఓడిపోయిన అభ్యర్థులను ఎలిమినేట్ చేస్తారు. ఒక్కో రౌండ్ మూడు రోజుల పాటు జరగుతుంది. మ్యాచ్‌లోని తొలి 40 ఎత్తులకు 90 నిమిషాలు కేటాయిస్తారు. ఆ తర్వాత మిగిలిన ఆటకు 30 నిమిషాలు మాత్రమే ఇస్తారు. అలాగే ఆటగాళ్లు ఎత్తులు వేసేందుకు తీసుకునే సమయాన్ని బట్టి ప్రతి ఎత్తుకు 30 సెకెన్ల ఇంక్రిమెంట్ కూడా పొందుతారు.


భారత్‌లో చివరి సారి 2002లో హైదరాబాద్‌లో చెస్ ప్రపంచ కప్‌ జరిగింది. ఆ తర్వాత చెస్‌కు సంబంధించి కొన్ని మెగా టోర్నీలు జరిగాయి కానీ, ప్రపంచకప్ మాత్రం ఇప్పటివరకు జరగలేదు. 2022లో చెస్ ఒలంపియాడ్, 2024లో ప్రపంచ జూనియర్ ఛాంపియన్‌షిప్, 2025 ఏప్రిల్‌లో ఉమెన్స్ గ్రాండ్ ఫ్రిక్స్ మొదలైన టోర్నీలు జరిగాయి. అక్టోబర్‌లో చెస్ వరల్డ్ కప్ జరగబోతోంది.


ఇవీ చదవండి:

బుమ్రా ఆడాల్సిందే

క్రికెట్‌కు రస్సెల్‌ గుడ్‌బై

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 21 , 2025 | 04:11 PM