Ind vs Pak: పాపం పాకిస్తాన్ అభిమానులు.. ఈసారి మ్యాచ్ ఓడిపోయినా టీవీలు పగలగొట్టలేరు..
ABN , Publish Date - Feb 22 , 2025 | 03:28 PM
భారత్, పాక్ మ్యాచ్ అంటే ఇరు దేశాల అభిమానులకే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్‌కు పెద్ద పండుగతో సమానం. ముఖ్యంగా ఐసీసీ ఈవెంట్లలో భారత్, పాక్ మ్యాచ్ జరుగుతోందంటే క్రికెట్ ప్రపంచం చూపు మొత్తం అటువైపే ఉంటుంది. ఆ హై ఓల్టేజ్ మ్యాచ్‌లో ఏ జట్టు ఓడిపోయినా ఆ దేశ అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురవుతుంటారు.

క్రికెట్ మైదానంలో దాయాది దేశాల సమరం అంటే ఉద్రిక్తతలు సామాన్యంగా ఉండవు. భారత్, పాక్ మ్యాచ్ (India vs Pakistan) అంటే ఇరు దేశాల అభిమానులకే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్‌కు పెద్ద పండుగతో సమానం. ముఖ్యంగా ఐసీసీ ఈవెంట్లలో భారత్, పాక్ మ్యాచ్ జరుగుతోందంటే క్రికెట్ ప్రపంచం చూపు మొత్తం అటువైపే ఉంటుంది. ఆ హై ఓల్టేజ్ మ్యాచ్‌లో ఏ జట్టు ఓడిపోయినా ఆ దేశ అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురవుతుంటారు. అయితే ఇప్పటివరకు జరిగిన ఐసీసీ మ్యాచ్‌ల్లో పాకిస్తాన్‌పై భారత్‌దే పై చేయి (Champions Trophy 2025).
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఫిబ్రవరి 23 (ఆదివారం)వ తేదీన భారత్, పాక్ మ్యాచ్ జరగబోతోంది. ఇప్పటికే న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న పాకిస్తాన్‌కు భారత్‌తో మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి. సాధారణంగా భారత్‌తో జరిగే ఐసీసీ మ్యాచ్‌ల్లో పాకిస్తాన్ ఓడిపోతే ఆ దేశ అభిమానులు (Pak Cricket Fans) విపరీత చర్యలకు దిగుతుంటారు. భారత్ చేతిలో పరాజయాన్ని జీర్ణించుకోలేక అభిమానులు టీవీలు పగలగొడుతుంటారు (breaking TV sets). అయితే ఈ సారి మాత్రం అలాంటి సీన్ ఉండదని ఆ దేశ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ. ఈసారి భారత్‌తో జరిగే పాకిస్తాన్ ఓడిపోయినా అభిమానులు టీవీలపై తమ ప్రతాపాన్ని చూపించలేరని చెబుతున్నాడు.
పాకిస్తాన్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సమస్యలతో సతమతమవుతోంది. ద్రవ్యోల్బణం ఆ దేశ వాసుల జీవనాన్ని పాతాళానికి పడేసింది. చిన్న చిన్న వస్తువుల రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. అలాంటి విపత్కర పరిస్థితుల్లో టీవీలు పగలగొట్టేంత సాహసం ఎవరూ చేయరని బాసిత్ అలీ చెబుతున్నాడు. కాగా, భారత్‌తో మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓడితే దాదాపు ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి నిష్క్రమించినట్టే. మ్యాచ్‌లో గెలిస్తే భారత్ సెమీ ఫైనల్ అవకాశాలు మరింత బలోపేతం అవుతాయి. దుబాయ్ వేదికగా ఆదివారం ఈ మ్యాచ్ జరగబోతోంది.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..