Share News

Champions Trophy: డకెట్ భారీ సెంచరీ.. ఆస్ట్రేలియా టార్గెట్ 352..

ABN , Publish Date - Feb 22 , 2025 | 06:29 PM

ఇంగ్లండ్ బ్యాటర్ బెన్ డకెట్ భారీ సెంచరీతో చెలరేగడంతో ఆస్ట్రేలియా ముందు భారీ లక్ష్యం నిలిచింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన డకెట్ 143 బంతుల్లో 17 ఫోర్లు, 3 సిక్స్‌లతో చెలరేగి 165 పరుగుల భారీ వ్యక్తిగత స్కోరు సాధించాడు. ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 351 పరుగుల భారీ స్కోరు సాధించింది.

Champions Trophy: డకెట్ భారీ సెంచరీ.. ఆస్ట్రేలియా టార్గెట్ 352..
Ben duckett

ఇంగ్లండ్ బ్యాటర్ బెన్ డకెట్ భారీ సెంచరీతో చెలరేగడంతో ఆస్ట్రేలియా ముందు భారీ లక్ష్యం నిలిచింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన డకెట్ 143 బంతుల్లో 17 ఫోర్లు, 3 సిక్స్‌లతో చెలరేగి 165 పరుగుల భారీ వ్యక్తిగత స్కోరు సాధించాడు. 43 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయిన స్థితిలో జో రూట్ (78 బంతుల్లో 68 పరుగులు)తో కలిసి ఇన్సింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు 158 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత రూట్ అయినా, డకెట్ (Ben duckett) జోరు మాత్రం తగ్గలేదు. మిగతా బ్యాటర్లు విఫలమైనా డకెట్ భారీ ఇన్సింగ్స్ కారణంగా ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 351 పరుగుల భారీ స్కోరు సాధించింది (Champions Trophy 2025).


ఆస్ట్రేలియా ముందు 352 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఆస్ట్రేలియా బౌలర్లు డకెట్‌ను నిలువరించడంలో విఫలమయ్యారు. చివర్లో జోఫ్రా ఆర్చర్ (10 బంతుల్లో 21) బ్యాట్ ఝుళిపించాడు. ఆసీస్ బౌలర్లలో బెన్ డ్వార్‌షిస్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఆడమ్ జంపా, లబుషే రెండేసి వికెట్లు తీశారు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా- ఇంగ్లండ్ (Aus vs Eng) మధ్య లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. గ్రూప్- బిలో భాగంగా జరుగుతోన్న ఈ రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసి భారీ పరుగులు సాధించింది.


ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీ ఆడుతున్న ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్ పాట్ కమ్మిన్స్‌తో పాటు ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్, మిచెల్ మార్ష్, మార్కస్ స్టోయినిస్ వంటి స్టార్లు దూరమయ్యారు. దీంతో ఆస్ట్రేలియా జట్టు గాడి తప్పింది. క్వాలిటీ బౌలర్లు లేని లోటు ప్రస్తుత మ్యాచ్‌లో స్పష్టంగా కనబడింది. ప్యాట్ కమిన్స్ లేకపోవడంతో ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా జట్టుకు స్టీవ్ స్మిత్ నాయకత్వం వహిస్తున్నాడు.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Feb 22 , 2025 | 06:29 PM