Champions Trophy: టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్..
ABN , Publish Date - Feb 22 , 2025 | 02:48 PM
ఛాంపియన్స్ ట్రోఫీలో నాలుగో మ్యాచ్ ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్ మధ్య లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాల అభిమానులు మాత్రమే కాదు క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.

ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy)లో మరో రసవత్తర మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఛాంపియన్స్ ట్రోఫీలో నాలుగో మ్యాచ్ ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్ (Aus vs Eng) మధ్య లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాల అభిమానులు మాత్రమే కాదు క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. గ్రూప్- బిలో భాగంగా జరుగుతోన్న ఈ రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఇంగ్లండ్ బ్యాటర్లు పరుగుల వేట మొదలు పెట్టారు.
వన్డే ఫార్మాట్‌లో ఇటీవలి కాలంలో ఈ రెండు జట్లు పేలవ ప్రదర్శనతో నిరాశపరిచాయి. టీమిండియాతో జరిగిన వన్డే సిరీస్‌ను ఇంగ్లండ్ 0-3తో కోల్పోయింది. ఇంక, ఆస్ట్రేలియాతో జరిగిన రెండు వన్డేల సిరీస్‌ను శ్రీలంక క్లీన్ స్వీప్ చేసింది. కాగా, కీలక ఆటగాళ్లు దూరం కావడంతో ఆస్ట్రేలియా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీ ఆడుతున్న ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్ పాట్ కమ్మిన్స్‌తో పాటు ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్, మిచెల్ మార్ష్, మార్కస్ స్టోయినిస్ వంటి స్టార్లు దూరమయ్యారు. దీంతో ఆస్ట్రేలియా జట్టు గాడి తప్పింది.
ప్యాట్ కమిన్స్ లేకపోవడంతో ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా జట్టుకు స్టీవ్ స్మిత్ నాయకత్వం వహించనున్నాడు. మరోవైపు భారత్‌తో ఓటమి కారణంగా ఇంగ్లండ్ జట్టులో కూడా జోష్ లోపించింది. అయితే ఆస్ట్రేలియా టీమ్‌తో పోల్చుకుంటే కాస్త బలంగానే కనిపిస్తోంది. మరి, ఈ రెండు జట్లలో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.
తుది జట్లు:
ఆస్ట్రేలియా: మాథ్యూ షార్ట్, ట్రావిస్ హెడ్, స్టీవెన్ స్మిత్ (కెప్టెన్), మార్నస్ లాబుస్చాగ్నే, జోష్ ఇంగ్లిస్ (కీపర్), అలెక్స్ కారీ, గ్లెన్ మాక్స్వెల్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్.
ఇంగ్లాండ్: ఫిలిప్ సాల్ట్, బెన్ డకెట్, జేమీ స్మిత్ (కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, బ్రైడాన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..