Share News

Para Athletics: భవాని డబుల్‌ ధమాకా

ABN , Publish Date - Jul 05 , 2025 | 03:39 AM

ప్రపంచ పారా అథ్లెటిక్స్‌ మహిళల గ్రాండ్‌ ప్రీలో ఆంధ్రప్రదేశ్‌ పారా అథ్లెట్‌ వి.భవాని రెండు స్వర్ణాలు కొల్లగొట్టి సంచలనం సృష్టించింది.

Para Athletics: భవాని డబుల్‌ ధమాకా

ఒలోమౌక్‌ (చెక్‌ రిపబ్లిక్‌): ప్రపంచ పారా అథ్లెటిక్స్‌ మహిళల గ్రాండ్‌ ప్రీలో ఆంధ్రప్రదేశ్‌ పారా అథ్లెట్‌ వి.భవాని రెండు స్వర్ణాలు కొల్లగొట్టి సంచలనం సృష్టించింది. చెక్‌ రిపబ్లిక్‌లోని ఒలొమౌక్‌లో జరుగుతున్న ఈ పోటీల్లో భవాని 100, 200 మీటర్ల స్ర్పింట్‌లో పసిడి పతకాలు సాధించింది. టీ46 విభాగంలో 100 మీ., రేసును 13.70 సెకన్లలో, 200 మీ., రేసును 29.07 సెకన్లలో ముగించి ప్రథమ స్థానం దక్కించుకుంది. భవాని స్వస్థలం నెల్లూరు.

Updated Date - Jul 05 , 2025 | 03:39 AM