IPL Contribution To BCC: బీసీసీఐ ఆర్జన రూ.9,741 కోట్లు
ABN , Publish Date - Jul 19 , 2025 | 05:16 AM
ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ధనిక బోర్డుగా విలసిల్లుతున్న బీసీసీఐ తమ ఆదాయాన్ని ఏటేటా రికార్డు

న్యూఢిల్లీ: ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ధనిక బోర్డుగా విలసిల్లుతున్న బీసీసీఐ తమ ఆదాయాన్ని ఏటేటా రికార్డు స్థాయిలో పెంచుకుంటోంది. తాజాగా 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను బోర్డు ఆదాయం రూ.9,741.70 కోట్లుగా తేలింది. ఇందులో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ద్వారానే ఏకంగా రూ.5,761 కోట్లు (59 శాతం) సమకూరడం విశేషం. 2007లో ఐపీఎల్ మొదలైనప్పటినుంచి బోర్డు ఖజానాకు ప్రధాన ఆదాయ వనరుగా మారింది. మరోవైపు బోర్డు దగ్గర దాదాపు రూ. 30 వేల కోట్లు రిజర్వ్‌లో ఉండగా, దానిపై వచ్చే వడ్డీయే ఏడాదికి వెయ్యి కోట్లు.
ఇవి కూడా చదవండి
యూట్యూబ్ హైప్ ప్రారంభం.. ఎలా ఉపయోగించాలో తెలుసా..
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి