Share News

T20 squad: దక్షిణాఫ్రికాతో తలపడే టీమిండియా టీ20 జట్టు ఇదే..

ABN , Publish Date - Dec 03 , 2025 | 07:09 PM

టెస్ట్, వన్డే సిరీస్ తర్వాత భారత్, దక్షిణాఫ్రికాలు టీ-20 ఫార్మాట్‌లో తలపడబోతున్నాయి. డిసెంబర్ 9వ తేదీ నుంచి భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఐదు మ్యాచ్‌ల టీ-20 సిరీస్ ప్రారంభం కాబోతోంది. ఈ సిరీస్ కోసం సెలక్టర్లు తాజాగా టీమిండియా జట్టును ప్రకటించారు.

T20 squad: దక్షిణాఫ్రికాతో తలపడే టీమిండియా టీ20 జట్టు ఇదే..
BCCI T20 squad

టెస్ట్, వన్డే సిరీస్ తర్వాత భారత్, దక్షిణాఫ్రికాలు టీ-20 ఫార్మాట్‌లో తలపడబోతున్నాయి. డిసెంబర్ 9వ తేదీ నుంచి భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఐదు మ్యాచ్‌ల టీ-20 సిరీస్ ప్రారంభం కాబోతోంది. ఈ సిరీస్ కోసం సెలక్టర్లు తాజాగా టీమిండియా జట్టును ప్రకటించారు. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని 15 మంది సభ్యులతో కూడిన టీమిండియాను ప్రకటించారు (India squad South Africa T20 series).


చాలా రోజులుగా క్రికెట్‌కు దూరంగా ఉన్న ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ సిరీస్‌తో పునరాగమనం చేయబోతున్నాడు. ఇక, టెస్ట్ సిరీస్‌లో గాయపడి వన్డే సిరీస్‌కు దూరమైన శుభ్‌మన్ గిల్ కూడా తిరిగి జట్టుతో చేరబోతున్నాడు. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ క్లియరెన్స్ ఇస్తే గిల్ టీ-20 మ్యాచ్‌లు ఆడతాడు. ఫామ్ లేమితో సతమతమవుతున్న రింకూ సింగ్‌పై వేటు పడింది (IND vs SA T20 team).


టీమిండియా టీ20 జట్టు: సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్), శుభ్‌మన్‌ గిల్‌ (వైస్‌ కెప్టెన్‌), అభిషేక్‌ శర్మ, తిలక్‌ వర్మ, హార్థిక్‌ పాండ్యా, శివమ్‌దూబే, జితేశ్‌ శర్మ, సంజూ శాంసన్‌, అక్షర్‌ పటేల్‌, బుమ్రా, వరుణ్‌ చక్రవర్తి, అర్షదీప్‌ సింగ్, కుల్దీప్‌ యాదవ్‌, హర్షిత్‌ రానా, వాషింగ్టన్‌ సుందర్‌

ఐదు మ్యాచ్‌లు టీ-20 సిరీస్ షెడ్యూల్..

  • తొలి టీ-20 - డిసెంబర్ 9 (కటక్)

  • రెండో టీ-20 - డిసెంబర్ 11 (ముల్లాన్‌పూర్)

  • మూడో టీ-20 - డిసెంబర్ 14 (ధర్మశాల)

  • నాలుగో టీ-20 - డిసెంబర్ 17 (లఖ్‌నవూ)

  • ఐదో టీ-20 - డిసెంబర్ 19 (అహ్మదాబాద్)


ఇవి కూడా చదవండి:

ఆ వార్తలన్నీ అవాస్తవం.. ఇప్పట్లో స్మృతి పెళ్లి జరగదు!

ఆ ఫార్మాట్‌లోనూ ఆడే సత్తా ఉంది: తిలక్ వర్మ

Updated Date - Dec 03 , 2025 | 07:09 PM