Share News

Asia Cup 2025 Full Schedule: క్రికెట్ ఫ్యాన్స్‌కు బిగ్ న్యూస్.. ఆసియా కప్ 2025 ఫుల్ షెడ్యూల్ రిలీజ్

ABN , Publish Date - Jul 26 , 2025 | 08:10 PM

క్రికెట్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే వార్త ఇది. ఆసియా కప్ 2025 షెడ్యూల్‌ అధికారికంగా ప్రకటించారు. సెప్టెంబర్ 9 నుంచి సెప్టెంబర్ 28 వరకు ఈ టోర్నమెంట్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) వేదికగా జరుగనుంది. మొత్తం 8 జట్లు..

Asia Cup 2025 Full Schedule: క్రికెట్ ఫ్యాన్స్‌కు బిగ్ న్యూస్.. ఆసియా కప్ 2025 ఫుల్ షెడ్యూల్ రిలీజ్
Asia Cup 2025 full schedule

ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్ అభిమానులకు అదిరిపోయే వార్త ఇది. ఆసియా కప్ 2025 షెడ్యూల్‌ అధికారికంగా ప్రకటించారు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) అధ్యక్షుడు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వి దీనిపై అధికారిక ప్రకటన చేశారు. సెప్టెంబర్ 9 నుంచి సెప్టెంబర్ 28 వరకు ఈ టోర్నమెంట్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) వేదికగా జరుగనుంది. మొత్తం 8 జట్లు ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో పాల్గొంటున్నాయి.

ఇక, ఆసియా కప్‌ 2025 టోర్నీలో పాల్గొనబోతున్న జట్ల విషయానికి వస్తే, భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), ఒమాన్, హాంకాంగ్ లు ఆసియా కప్ 2025 కోసం పోటీ పడబోతున్నాయి.ఈ జట్లు 2024 ACC మెన్స్ ప్రీమియర్ కప్ లో పొందిన అర్హత ఆధారంగా ఎంపికయ్యాయి. మొత్తం 20 రోజుల పాటు టీ20 ఫార్మాట్‌లో ఆసియా కప్ 2025 జరగనుంది. ఇప్పటికి 8 సార్లు భారత్ ఆసియా కప్ ను గెలుచుకుంది. ఈ టోర్నీలో భారత క్రికెట్ జట్టు ట్రాక్ రికార్డ్ సూపర్ గా ఉంది. ఇప్పటివరకు 16 ఎడిషన్లలో ఎనిమిది సార్లు భారత్ టైటిల్‌ సొంతం చేసుకుంది.

ఈ ఎడిషన్ ఆసియా కప్‌లో మొత్తం 19 మ్యాచ్‌లు జరుగుతాయి. భారతదేశం, పాకిస్తాన్ ఒకే గ్రూప్‌లో ఉండగా, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ మరో గ్రూప్‌లో ఉన్నాయి. ఈ పోటీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లోని అబుదాబి, దుబాయ్ రెండు వేదికలలో జరుగుతుంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఈ టోర్నీ ఆతిథ్య హక్కులను కలిగి ఉన్నప్పటికీ, భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య కొనసాగుతున్న సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా ఈ టోర్నమెంట్ తటస్థ వేదికలో నిర్వహించాలని నిర్ణయించారు.


ఆసియా కప్ 2025 గ్రూపులు

గ్రూప్ A: భారతదేశం, పాకిస్తాన్, UAE, ఒమన్

గ్రూప్ B: శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్

ఆసియా కప్ 2025 ఫార్మాట్

ప్రతి గ్రూప్ నుండి రెండు జట్లు సూపర్ ఫోర్ దశకు అర్హత సాధిస్తాయి. సూపర్ ఫోర్స్‌లో, ప్రతి జట్టు మిగతా మూడు జట్లతో ఒకసారి తలపడుతుంది. సూపర్ ఫోర్ దశలో ఉన్న రెండు జట్లు ఫైనల్‌కు ఆడతాయి. ఆసియా కప్‌లో భారత్, పాకిస్తాన్ మూడు సార్లు తలపడే అవకాశం ఉంది.


ఆసియా కప్ 2025 పూర్తి షెడ్యూల్

గ్రూప్ దశ

సెప్టెంబర్ 9 (మంగళవారం): ఆఫ్ఘనిస్తాన్ vs హాంకాంగ్

సెప్టెంబర్ 10 (బుధవారం): భారతదేశం vs UAE

సెప్టెంబర్ 11 (గురువారం): బంగ్లాదేశ్ vs హాంకాంగ్

సెప్టెంబర్ 12 (శుక్రవారం): పాకిస్తాన్ vs ఒమన్

సెప్టెంబర్ 13 (శనివారం): బంగ్లాదేశ్ vs శ్రీలంక

సెప్టెంబర్ 14 (ఆదివారం): భారతదేశం vs పాకిస్తాన్

సెప్టెంబర్ 15 (సోమవారం): శ్రీలంక vs హాంకాంగ్

సెప్టెంబర్ 16 (మంగళవారం): బంగ్లాదేశ్ vs ఆఫ్ఘనిస్తాన్

సెప్టెంబర్ 17 (బుధవారం): పాకిస్తాన్ vs UAE

సెప్టెంబర్ 18 (గురువారం): శ్రీలంక vs ఆఫ్ఘనిస్తాన్

సెప్టెంబర్ 19 (శుక్రవారం): భారతదేశం vs ఒమన్

సూపర్ 4

సెప్టెంబర్ 20 (శనివారం): గ్రూప్ B క్వాలిఫైయర్ 1 vs గ్రూప్ B క్వాలిఫైయర్ 2

సెప్టెంబర్ 21 (ఆదివారం): గ్రూప్ A క్వాలిఫైయర్ 1 vs గ్రూప్ A క్వాలిఫైయర్ 2

సెప్టెంబర్ 22 (సోమవారం): విశ్రాంతి దినం

సెప్టెంబర్ 23 (మంగళవారం): గ్రూప్ A క్వాలిఫైయర్ 1 vs గ్రూప్ B క్వాలిఫైయర్ 2

సెప్టెంబర్ 24 (బుధవారం): గ్రూప్ బి క్వాలిఫైయర్ 1 vs గ్రూప్ ఎ క్వాలిఫైయర్ 2

సెప్టెంబర్ 25 (గురువారం): గ్రూప్ ఎ క్వాలిఫైయర్ 2 vs గ్రూప్ బి క్వాలిఫైయర్ 2

సెప్టెంబర్ 26 (శుక్రవారం): గ్రూప్ ఎ క్వాలిఫైయర్ 1 vs గ్రూప్ బి క్వాలిఫైయర్ 1

సెప్టెంబర్ 27 (శనివారం): బ్రేక్ డే

ఫైనల్

సెప్టెంబర్ 28 (ఆదివారం): ఫైనల్ మ్యాచ్

Asia Cup 2025.jpeg


జట్లన్నీ సెప్టెంబర్ 7వ తేదీకి యుఎఇకి చేరుకుంటాయి. వార్మప్ మ్యాచ్‌లు షెడ్యూల్ చేయాల్సి ఉంది. ఈ టోర్నమెంట్ కు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇండియా స్పాన్సర్లు, ప్రసార సంస్థల నుంచే వస్తోంది. సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా (SPNI) 2024లో ఆసియా కప్ ఈవెంట్‌ల మీడియా హక్కులను ఎనిమిది సంవత్సరాలకు 170 మిలియన్ల USDలకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

Asia Cup 3.jpeg


Asia Cup 2.jpeg

ఇవి కూడా చదవండి

ఇండియన్ ట్రావెలర్స్‌కు అలర్ట్.. ఈ మార్పులు గురించి తప్పక తెలుసుకోండి..

స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అలర్ట్.. స్ర్కీన్ టైం తగ్గించుకోకపోతే ఈ చర్మ సమస్యలు..!

Updated Date - Jul 26 , 2025 | 08:59 PM