Share News

Business Credit Cards: బిజినెస్ క్రెడిట్ కార్డుల ఉపయోగాలు

ABN , Publish Date - Jul 26 , 2025 | 07:37 PM

బ్యాంకులు వివిధ రకాల క్రెడిట్ కార్డులు ఇస్తుంటాయి. అయితే, వీటిలో బిజినెస్ క్రెడిట్ కార్డుల పాత్ర చాలా ఎక్కువ. వ్యాపార ఖర్చులకు, రివార్డ్‌లు, క్యాష్ ఫ్లోను మెరుగుపరచడానికి, తద్వారా వ్యాపార సంబంధిత ప్రయోజనాలను పొందడానికి..

Business Credit Cards: బిజినెస్ క్రెడిట్ కార్డుల ఉపయోగాలు
business credit cards

ఇంటర్నెట్ డెస్క్: బ్యాంకులు వివిధ రకాల క్రెడిట్ కార్డులు ఇస్తుంటాయి. అయితే, వీటిలో బిజినెస్ క్రెడిట్ కార్డుల పాత్ర చాలా ఎక్కువ. వ్యాపార ఖర్చులను నిర్వహించడానికి, రివార్డ్‌లు సంపాదించడానికి, క్యాష్ ఫ్లోను మెరుగుపరచడానికి, వ్యాపార సంబంధిత ప్రయోజనాలను పొందడానికి బిజినెస్ క్రెడిట్ కార్డులు సహాయపడతాయి. ఈ కార్డులు స్టార్టప్‌లు, చిన్న, మధ్య తరహా వ్యాపారాలు, స్వయం ఉపాధి వ్యక్తులు, ఇంకా కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉంటాయి. ఈ ఏడాది మరిన్ని సదుపాయాలతో బిజినెస్ క్రెడిట్ కార్డులను ఆయా బ్యాంకులు సరికొత్త కార్డ్స్ ప్రవేశపెడుతున్నాయి.


బిజినెస్ క్రెడిట్ కార్డుల ఉపయోగాలు

ఎక్స్‌పెన్స్ ట్రాకింగ్ :

ఈ సౌలభ్యం వ్యాపార ఖర్చులను వ్యక్తిగత ఖర్చుల నుండి వేరు చేస్తుంది. టాక్స్ ఫైలింగ్, ఆడిట్‌ను సులభతరం చేస్తుంది.

ఆన్‌లైన్ ఎక్స్‌పెన్స్ మేనేజ్‌మెంట్ టూల్స్ :

ఉదాహరణకు ( Visa IntelliLink, HDFC MyCards) ద్వారా రియల్-టైం ట్రాకింగ్ అండ్ రిపోర్టింగ్ సౌలభ్యం ఉంటుంది. దీంతోపాటు, బిల్ చెల్లింపులు, వెండర్ చెల్లింపులను ట్రాక్ చేయడానికి సహాయపడుతుంది.

క్యాష్ ఫ్లో మేనేజ్‌మెంట్ :

20-55 రోజుల వడ్డీ రహిత క్రెడిట్ పీరియడ్, తక్షణ నగదు ఖర్చు లేకుండా వ్యాపార ఖర్చులను నిర్వహించడానికి దోహదపడతాయి. ఉదాహరణకు HDFC Biz Grow కార్డ్ GST చెల్లింపులపై 55 రోజుల వడ్డీ రహిత క్రెడిట్‌ను అందిస్తుంది. అంతేకాకుండా EMI ఆప్షన్లు ఉపయోగించుకుని పెద్ద మొత్తంలోని ట్రాన్సాక్షన్స్ కన్వర్ట్ చేసుకునే వీలుంటుంది.

రివార్డ్ పాయింట్లు, క్యాష్‌బ్యాక్ :

బిజినెస్ ఖర్చులపై (టాక్స్, బిల్‌లు, ట్రావెల్, డైనింగ్) అధిక రివార్డ్ రేట్‌లు అందుబాటులో ఉన్నాయి. రివార్డ్ పాయింట్లను ఎయిర్ మైల్స్, హోటల్ బుకింగ్‌లు, క్యాష్‌బ్యాక్ లేదా గిఫ్ట్ వోచర్‌ల కోసం రిడీమ్ చేయవచ్చు. ఉదాహరణకు YES Prosperity Card ట్రావెల్, ఇంకా డైనింగ్‌పై 4ఎక్స్ రివార్డ్ పాయింట్లు లేదా రూ.100 అందిస్తుంది.

ట్రావెల్ ప్రయోజనాలు :

ఉచిత ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ (దేశీయ, అంతర్జాతీయ) ఉంటుంది. అంతేకాకుండా విదేశీ లావాదేవీలపై తక్కువ ఫారెక్స్ మార్కప్ ఫీస్ (0% నుండి 2.5%) వరకూ వెసులుబాటు పొందొచ్చు.

ట్రావెల్ ఇన్సూరెన్స్ :

ఎయిర్ యాక్సిడెంట్, లగేజ్ నష్టం, వైద్య ఖర్చులకు బీమా సౌకర్యం ఉంటుంది. ఉదాహరణకు Amex Business Platinum కార్డ్ జీరో ఫారెక్స్ ఫీ, ఇంకా ప్రీమియం ట్రావెల్ ఇన్సూరెన్స్ అందిస్తుంది.

ఫ్యూయల్ సర్ఖార్జ్ వైవర్ :

వాహనాల్లో పెట్రోలు, డీజిల్ తదితర ఇందనం నింపుకునే సమయంలో ఫ్యూయల్ ట్రాన్సాక్షన్స్‌పై 1-3.5% సర్ఖార్జ్ తగ్గుతుంది. ఉదాహరణకు Axis My Business Card, IndusInd Credit Card తదితరాలు రూ.400-5,000 మధ్య ట్రాన్సాక్షన్స్‌పై ఈ ప్రయోజనాన్ని సాధారణంగానే కల్పిస్తున్నాయి.

వెండర్ డిస్కౌంట్లు, ఆఫర్స్ :

MMT MyBiz, Google Workspace, Zoho, Swiggy Dineout వంటి ప్లాట్‌ఫామ‌్లలో డిస్కౌంట్‌లు లభిస్తాయి. ఉదాహరణకు HDFC BizPower Card.. MMT MyBiz ద్వారా ఫ్లైట్‌లు, హోటల్ బుకింగ్‌లపై 4% డిస్కౌంట్ అందిస్తుంది.


ఇలా బిజినెస్ కార్డుల వల్ల ఇన్సూరెన్స్, సెక్యూరిటీ, స్పెండ్ కంట్రోల్, ఎంప్లాయీ స్పెండ్ లిమిట్స్ సెట్ చేయడం, టైన్‌లో ఖర్చులను నియంత్రించడం వంటివి కూడా సెట్ చేసుకోవచ్చు. బిజినెస్ క్రెడిట్ కార్డులు వ్యాపార ఖర్చులను సమర్థవంతంగా నిర్వహించడానికి, రివార్డ్‌లు సంపాదించడానికి, క్యాష్‌ ఫ్లోను మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి. అయితే, మీ వ్యాపార ఖర్చు అలవాట్లు, ట్రావెల్ ఫ్రీక్వెన్సీ, బడ్జెట్‌ను బట్టి సరైన కార్డ్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది.


కార్గిల్ విజయ్ దివస్.. అమర వీరులకు రాష్ట్రపతి, ప్రధాని నివాళి

నితీష్‌కు మద్దతిచ్చినందుకు చింతిస్తున్నా... కేంద్ర మంత్రి నిప్పులు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 26 , 2025 | 07:37 PM