Share News

National Record Athletics India: అనిమేష్‌, చిత్రవేల్‌ జాతీయ రికార్డులు

ABN , Publish Date - Apr 25 , 2025 | 04:00 AM

ఫెడరేషన్‌ కప్‌ అథ్లెటిక్స్‌లో ఒడిశా స్ప్రింటర్‌ అనిమేష్‌ కుజుర్‌ 200 మీటర్ల రేస్‌లో కొత్త జాతీయ రికార్డు సృష్టించి స్వర్ణం సాధించాడు. ట్రిపుల్‌ జంప్‌ స్టార్‌ ప్రవీణ్‌ చిత్రవేల్‌ 17.37 మీటర్ల జాతీయ రికార్డును సమం చేసి పసిడి పతకం గెలిచాడు

National Record Athletics India: అనిమేష్‌, చిత్రవేల్‌ జాతీయ రికార్డులు

ఫెడరేషన్‌ కప్‌ అథ్లెటిక్స్‌ కోచి: ఒడిశా స్ప్రింటర్‌ అనిమేష్‌ కుజుర్‌ పురుషుల 200 మీ. రేస్‌లో, ట్రిపుల్‌ జంప్‌ స్టార్‌ ప్రవీణ్‌ చిత్రవేల్‌ కొత్త జాతీయ రికార్డులతో భళా అనిపించారు. గురువారం ముగిసిన ఫెడరేషన్‌ కప్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షి్‌ప 200 మీ. పరుగులో 21 ఏళ్ల కుజుర్‌ 20.40 సెకన్ల రికార్డ్‌ టైమింగ్‌తో గమ్యాన్ని చేరి స్వర్ణం సాధించాడు. ఇక ట్రిపుల్‌ జంప్‌లో చిత్రవేల్‌ తన పేరిటే ఉన్న 17.37 మీటర్ల జాతీయ రికార్డును సమం చేసి పసిడి పతకం కొల్లగొట్టాడు. ఈ క్రమంలో 17.22 మీటర్ల ప్రపంచ చాంపియన్‌షి్‌ప్స నిర్దేశిత దూరాన్నీ అతడు అధిగమించాడు.

Updated Date - Apr 25 , 2025 | 04:02 AM