Share News

AP Athletes: ఏపీకి ఏడు పతకాలు

ABN , Publish Date - Jul 12 , 2025 | 02:40 AM

ఇండియన్‌ ఓపెన్‌ పారా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో తెలుగు అథ్లెట్లు సత్తా చాటారు...

AP Athletes: ఏపీకి ఏడు పతకాలు

బెంగళూరు: ఇండియన్‌ ఓపెన్‌ పారా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో తెలుగు అథ్లెట్లు సత్తా చాటారు. శుక్రవారం మొదలైన ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌ అథ్లెట్లు ఏడు పతకాలు సాధించారు. ఇందులో ఓ స్వర్ణం, 3 రజతాలు, 3 కాంస్యాలు నెగ్గారు. రవి (ఎఫ్‌40 షాట్‌పుట్‌) పసిడి నెగ్గగా.. యాదగిరి (టీ54 షాట్‌పుట్‌), భవాని (100 మీ.), వెంకటేశ్వర్లు (100 మీ.) రజతాలు.. భవాని (లాంగ్‌జంప్‌), శ్రీహరి (లాంగ్‌జంప్‌), లోకేశ్‌ (హైజంప్‌) కాంస్యాలు దక్కించుకున్నారు. ఇక, తెలంగాణకు చెందిన దీప్తి జివాంజి (400 మీ.), అకీరా నందన్‌ (400 మీ.) స్వర్ణాలు సాధించారు.

Updated Date - Jul 12 , 2025 | 02:40 AM