AB de Villiers: ఆ జట్టు నిండా విషపూరిత వ్యక్తులే.. ఐపీఎల్ జట్టుపై డివిల్లీర్స్ సంచలన కామెంట్స్
ABN , Publish Date - Jun 16 , 2025 | 08:55 AM
డివిల్లీర్స్ అనగానే ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ గుర్తుకొస్తుంది. ఆ జట్టు తరఫున డివిల్లీర్స్ ఎన్నో విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడాడు. అయితే డివిల్లీర్స్ ఐపీఎల్ కెరీర్ మాత్రం ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుతో మొదలైంది. 2008-10 మధ్యలో ఢిల్లీ టీమ్ తరఫున ఏబీడీ ఆడాడు.

దక్షిణాఫ్రికా సూపర్ బ్యాటర్ ఏబీ డివిల్లీర్స్ (AB de Villiers)కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. ముఖ్యంగా భారత్‌లో డివిల్లీర్స్‌కు ఫ్యాన్స్ ఎక్కువ. డివిల్లీర్స్ అనగానే ఐపీఎల్ (IPL)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) టీమ్ గుర్తుకొస్తుంది. ఆ జట్టు తరఫున డివిల్లీర్స్ ఎన్నో విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడాడు. అయితే డివిల్లీర్స్ ఐపీఎల్ కెరీర్ మాత్రం ఢిల్లీ డేర్ డెవిల్స్ (Delhi Daredevils) జట్టుతో మొదలైంది. 2008-10 మధ్యలో ఢిల్లీ టీమ్ తరఫున ఏబీడీ ఆడాడు. ఆ సమయంలో ఆ జట్టుకు సెహ్వాగ్ నాయకుడు.
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఏబీడీ.. ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఢిల్లీ జట్టుపై సంచలన కామెంట్స్ చేశాడు. తాను ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున ఆడిన సమయంలో ఆ జట్టు నిండా విషపూరిత వ్యక్తులు (Poisonous characters) ఉన్నారని డివిల్లీర్స్ వ్యాఖ్యానించాడు. ఆ వ్యక్తుల పేర్లు చెప్పడానికి నిరాకరించినప్పటికీ, ఆ సమయంలో జట్టులో చాలా గందరగోళం ఉండేదని చెప్పాడు. ఢిల్లీ జట్టులో అలాంటి విషపూరిత వ్యక్తులతో పాటు గొప్ప ఆటగాళ్లు కూడా ఉన్నారని, ఆ జట్టుకు ఆడిన సమయంలో తనకు చాలా చేదు, తీపి జ్ఞాపకాలున్నాయని డివిల్లీర్స్ గుర్తు చేసుకున్నాడు.
ముఖ్యంగా ఆస్ట్రేలియా దిగ్గజం గ్లెన్ మెక్‌గ్రాత్, న్యూజిలాండ్ స్టార్ డానియెల్ వెట్టోరీ వంటి దిగ్గజాలతో గడిపిన సమయం తన కెరీర్‌లో, జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకాలుగా మిగిలిపోయాయని డివిల్లీర్స్ చెప్పుకొచ్చాడు. అలాగే 2011 మెగా వేలానికి ముందు ఢిల్లీ జట్టు యాజమాన్యం తనను రిటైన్ చేసుకుంటామని చెప్పిందని, అయితే చివరకు వేలంలోకి వదిలేయడం తనకు ఆశ్చర్యం కలిగించిందని కూడా ఏబీడీ వివరించారు. 2009 సీజన్‌లో ఢిల్లీ తరఫున డివిల్లీర్స్ అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడి ఓ సెంచరీ కూడా చేశాడు.
ఇవీ చదవండి:
వెళ్లి గల్లీ క్రికెట్ ఆడుకోండి
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి