Women In Police Station : ఈ భార్య మొండితనం చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.. ఏకంగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఏం చేసిందంటే..
ABN , Publish Date - Jul 03 , 2025 | 08:25 AM
మొగుడు వద్దు.. కొడుకు వద్దు.. ప్రియుడే కావాలి అంటూ ఓ భార్య పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసులు ఆమె మనసును మార్చాలని ఎంత ప్రయత్నించినా కూడా ఆమె అస్సలు వినిపించుకోవడం లేదు.. ఇంకా ఏం చేసిందంటే..

Women In Police Station News: ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లాలోని పక్‌బాడా పోలీస్ స్టేషన్‌లో మంగళవారం ఒక విచిత్ర ఘటన చోటుచేసుకుంది. నాకు మొగుడు వద్దు.. కొడుకు వద్దు.. ప్రియుడే కావాలి అంటూ ఓ భార్య పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. భర్తను వదిలి ప్రేమికుడితోనే జీవించాలని ఉందని మొండిపట్టు పట్టింది. పోలీసులు, కుటుంబ సభ్యులు ఎంత ఒప్పించినా ఆమె తన నిర్ణయం మాత్రం మార్చుకోవడం లేదు.
పోలీసుల సమాచారం ప్రకారం, మొరాదాబాద్‌కు చెందిన ఓ యువకుడు ఏడేళ్ల క్రితం అమ్రోహా జిల్లాలోని దిదౌలి గ్రామానికి చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. ఇటీవల ఆ మహిళ అమ్రోహా ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో ప్రేమలో పడింది. ఈ క్రమంలో మంగళవారం ఆమె తన ప్రేమికుడితో కలిసి నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది.
భర్త అంటే ఇష్టం లేదని, ప్రేమికుడితోనే ఉండాలని ఉందని తన నిర్ణయాన్ని ఆమె స్పష్టంగా తెలిపింది. ఈ ఘటనతో పోలీస్ స్టేషన్‌లో ఉన్నవారు ఆశ్చర్యపోయారు. వెంటనే ఆ మహిళ కుటుంబ సభ్యులను పిలిపించారు. ఆమె భర్తతో పాటు కుటుంబ సభ్యులు కూడా స్టేషన్‌కు వచ్చి ఆమెను ఒప్పించేందుకు ప్రయత్నించారు. కానీ, ఆమె తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. కుటుంబం, కుమారుడి భవిష్యత్తు గురించి ఆలోచించాలని పోలీసులు సలహా ఇచ్చినా, ఆమె మొండిగా తన ప్రేమికుడితోనే జీవిస్తానని తేల్చి చెప్పింది. పోలీస్ స్టేషన్ ముందే భీష్మించుకుని కూర్చుంది. అయితే, ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియని పోలీసులు భార్యాభర్తలను తమ కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి పంపించి..ప్రేమికుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ఘటన ఇప్పుడు ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.
Also Read:
అపురూప దృశ్యం.. శివుడికి అభిషేకం చేసిన గంగమ్మ
ఈ హోటల్లో అప్పు పెట్టాలంటే ఆలోచించాల్సిందే.. యజమాని ఏం రాశాడో చూస్తే..
For More Viral News