Share News

Vishal And Dhanshika: ఓ ఇంటి వాడు కాబోతున్న విశాల్.. పెళ్లి ఎప్పుడంటే..

ABN , Publish Date - May 19 , 2025 | 09:59 PM

Vishal And Dhanshika Wedding: నడిగర్ సంఘం బిల్డింగ్ కడతానని విశాల్ మాటిచ్చి ఇప్పటికి 9 ఏళ్లు అవుతోంది. మూడేళ్లలోనే బిల్డింగ్ కట్టేస్తాననే నమ్మకంతో విశాల్ ఉన్నారు. అయితే, అనుకోని విధంగా అది 9 ఏళ్లు అయింది.

Vishal And Dhanshika: ఓ ఇంటి వాడు కాబోతున్న విశాల్.. పెళ్లి ఎప్పుడంటే..
Vishal And Dhanshika

తమిళ స్టార్ హీరో విశాల్ ఓ ఇంటి వాడు కాబోతున్న సంగతి తెలిసిందే. హీరోయిన్ సాయి ధన్సికను ఆయన పెళ్లాడబోతున్నారు. వీరి పెళ్లి డేట్‌పై కూడా ఓ క్లారిటీ వచ్చింది. పెళ్లి ఎప్పుడు జరగబోతోందో ఈ జంట ప్రకటించేసింది. 2025, ఆగస్టు 29న తాము పెళ్లి చేసుకోబోతున్నట్లు ధన్సిక తెలిపింది. అయితే.. విశాల్ పెళ్లికి .. నడిగర్ సంఘం భవనానికి సంబంధం ఉంది. ‘నడిగర్‌ సంఘం’ భవన‌ నిర్మాణం పూర్తైన తర్వాతే తాను పెళ్లి చేసుకుంటానని విశాల్ గతంలో ప్రకటించారు.


ఆగస్టు 15వ తేదీన నడిగర్ సంఘం భవనం ఓపెన్ కానుంది. ఆగస్టు 29న విశాల్ పుట్టిన రోజు ఉంది. విశాల్ పుట్టిన రోజు నాడే పెళ్లి జరగనుంది. కేవలం నడిగర్ సంఘం బిల్డింగ్ కోసమే ఆయన తన పెళ్లిని వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఆగస్టులో బిల్డింగ్ ఓపెన్ అయిన వెంటనే పెళ్లి చేసుకోబోతున్నారు. విశాల్ తన పెళ్లి గురించి నాలుగు రోజుల క్రితమే మీడియాకు తెలిపారు. ఓ తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆగస్టులో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. అయితే, ఆ అమ్మాయి ఎవరో మాత్రం చెప్పలేదు.


బిల్డింగ్ పూర్తి కావటానికి 9 ఏళ్లు

నడిగర్ సంఘం బిల్డింగ్ కడతానని విశాల్ మాటిచ్చి ఇప్పటికి 9 ఏళ్లు అవుతోంది. మూడేళ్లలోనే బిల్డింగ్ కట్టేస్తాననే నమ్మకంతో విశాల్ ఉన్నారు. అయితే, అనుకోని విధంగా అది 9 ఏళ్లు అయింది. గతంలో ఆయన అనీషా అనే నటిని ప్రేమించారు. హైదరాబాద్‌కు చెందిన ఆమెతో నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. అనుకోని కారణాల వల్ల ఇద్దరి పెళ్లి ఆగిపోయింది. నటి అభినయతో విశాల్ పెళ్లి జరగనుందని గతంలో ప్రచారం జరిగింది. కానీ, ఆమె వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. చాలా కాలం సస్పెన్స్ తర్వాత విశాల్, ధన్సికను పెళ్లి చేసుకోబోతున్నారు.


ఇవి కూడా చదవండి

Google Chrome Users: హై రిస్క్‌లో క్రోమ్ యూజర్లు.. ప్రభుత్వం హెచ్చరిక..

YouTuber Jyoti Malhotra: జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ వ్లాగ్.. ఇది అస్సలు ఊహించలేదు..

Updated Date - May 19 , 2025 | 10:42 PM