Urvashi Rautelas Dior Bag: హీరోయిన్ బ్యాగు చోరీ.. అందులో 70 లక్షల విలువైన నగలు..
ABN , Publish Date - Jul 31 , 2025 | 06:33 PM
Urvashi Rautelas Dior Bag: ఊర్వశి రౌతేలా చివరగా సన్నీ డియోల్ హీరోగా నటించిన ‘జాట్’ సినిమాలో కనిపించింది. అంతకు ముందు బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘డాకూ మహరాజ్’ సినిమాలో నటించింది.

ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతేలాకు లండన్ గేట్ విక్ ఎయిర్ పోర్టులో ఊహించని షాక్ తగిలింది. ఖరీదైన ఆమె డియోర్ బ్యాగును ఎవరో చోరీ చేశారు. ఆ బ్యాగులో రూ.70 లక్షల విలువైన నగలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. లండన్‌లో జరుగుతున్న వింబుల్డన్ ఛాంపియన్‌షిప్ కోసం ఊర్వశి రౌతేలా ఇవాళ(గురువారం) ముంబై నుంచి లండన్ వెళ్లారు. లండన్ గేట్ విక్ ఎయిర్ పోర్టులో ఎవరో ఆమె బ్యాగును చోరీ చేశారు. దీంతో ఊర్వశి షాక్ అయింది.
ఎయిర్ పోర్టు అధికారులకు కంప్లైంట్ చేసింది. ఆ వెంటనే తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు పెట్టింది. బ్యాగును తిరిగి పొందేందుకు సాయం చేయమంటూ విజ్ఞప్తి చేసింది. ఆ బ్యాగులో రూ.70 లక్షల విలువ చేసే నగలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక, ఊర్వశి పెట్టిన పోస్టుపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘డియోర్ బ్రౌన్ బ్యాగు పోగొట్టుకున్న మొట్ట మొదటి హీరోయిన్ మీరే’..‘మీరేం బాధపడకండి. మీ బ్యాగ్ మీకు తప్పకుండా దొరుకుతుంది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
కాగా, ఊర్వశి రౌతేలా చివరగా సన్నీ డియోల్ హీరోగా నటించిన ‘జాట్’ సినిమాలో కనిపించింది. అంతకు ముందు బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘డాకూ మహరాజ్’ సినిమాలోనూ నటించింది. ప్రస్తుతం తెలుగులో ‘బ్లాక్ రోజ్’ అనే సినిమాలో నటిస్తోంది. ఇక, హిందీలో వెల్‌కమ్ టు ది జంగల్, కసూర్ 2 అనే సినిమాల్లో నటిస్తోంది. ఈ మూడు సినిమాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి.
ఇవి కూడా చదవండి
నోయల్‌కు ఇండియాలో చేదు అనుభవం.. లాక్కెళ్లిన పోలీసులు..
తల్లికి చివరి మెసేజ్.. అమ్మా నన్ను వీళ్లే చంపేస్తారు..