Share News

టైటానిక్ మృత్యుంజయుడి లేఖ రూ. 3 కోట్లు

ABN , Publish Date - Apr 27 , 2025 | 02:47 PM

Titanic Survivor Letter: నేను గడ్డ కట్టేంత చలిగా ఉండే సముద్రంలోకి దూకాడు. ఈతకొట్టుకుంటూ ఓ లైఫ్ బోటులోకి వెళ్లాను. ఆ పడవలోకి చాలా మంది చేరటంతో.. అది కూడా నీటిలో మునిగిపోయింది. మరో లైఫ్ బోటులోని ప్రయాణికులు నన్ను రక్షించారు’ అని చెప్పుకొచ్చాడు.

టైటానిక్ మృత్యుంజయుడి లేఖ రూ. 3 కోట్లు
Titanic Survivor Letter

1912 ఏప్రిల్ 15వ తేదీన అట్లాంటిక్ మహా సముద్రంలో ప్రయాణిస్తున్న టైటానిక్ నౌక ప్రమాదానికి గురైంది. ఓ భారీ మంచు గడ్డను ఢీకొట్టడంతో నౌకకు చిల్లు పడింది. దాని కారణంగా నౌకలోకి నీరు చేరి రెండు ముక్కలుగా విరిగిపోయింది. సముద్రంలోకి వెళ్లిపోయింది. ఈ ప్రమాదం జరిగినపుడు ఆ నౌకలో 2,224 మంది ఉన్నారు. వారిలో 1500 మంది చనిపోయారు. బతికి బయటపడ్డ వారు అత్యంత భయానకమైన ప్రమాదానికి సజీవ సాక్ష్యులుగా నిలిచారు. టైటానిక్‌లో షిప్‌లో కోలోనెల్ ఆర్కిబాల్డ్ గ్రీసీ అనే వ్యక్తి కూడా ప్రయాణిస్తూ ఉన్నాడు. ఏప్రిల్ 10వ తేదీన అతడు ఓ లేఖ రాశాడు. ఆ లేఖలో ‘ టైటానిక్ మంచి నౌకే.. కానీ, నా ప్రయాణం పూర్తయ్యేంత వరకు దీని గురించి ఏమీ చెప్పలేను’ అని రాశాడు.


అతడు లేఖ రాసిన 5 రోజులకు ప్రమాదం జరిగింది. నౌక రెండు ముక్కలై సముద్రంలో మునిగిపోయింది. టైటానిక్ ప్రమాదం నుంచి బయటపడ్డ వారిలో కోలోనెల్ ఆర్కిబాల్డ్ గ్రీసీ కూడా ఉన్నాడు. గ్రీసీ ప్రమాదం గురించిన అనుభవాలను గుర్తు చేసుకుంటూ ఓ పుస్తకం కూడా రాశాడు. ‘ ది ట్రూత్ ఎబౌట్ ది టైటానిక్ ’ అనే పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో తాను ఎలా బతికి బయటపడ్డాడో రాసుకొచ్చాడు. ‘ ఓడ రెండు ముక్కలై నీటిలో మునిగిపోతూ ఉంది. నేను గడ్డ కట్టేంత చలిగా ఉండే సముద్రంలోకి దూకాడు. ఈతకొట్టుకుంటూ ఓ లైఫ్ బోటులోకి వెళ్లాను. ఆ పడవలోకి చాలా మంది చేరటంతో.. అది కూడా నీటిలో మునిగిపోయింది.


మరో లైఫ్ బోటులోని ప్రయాణికులు నన్ను రక్షించారు’ అని చెప్పుకొచ్చాడు. పాపం.. టైటానిక్ ప్రమాదం నుంచి బయటపడ్డా.. గడ్డ కట్టే నీటి కారణంగా ఆయన హైపోథెర్మీయాకు గురయ్యారు. బతికున్నంత కాలం దాని ప్రభావం ఆయనపై ఉండింది. చాలా ఇబ్బందులు పడ్డారు. 1912 డిసెంబర్ నెలలో కోలోనెల్ ఆర్కిబాల్డ్ గ్రీసీ డయాబెటిస్ కారణంగా చనిపోయారు. టైటానిక్ షిప్ ప్రమాదంనుంచి ప్రాణాలతో బయటపడి.. మొదట ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి కోలోనెల్ ఆర్కిబాల్డ్ గ్రీసీ కావటం గమనార్హం. టైటానిక్ షిప్‌లో ఆయన ఉన్నపుడు రాసిన లేఖను తాజాగా వేలం వేశారు. ఆ లేఖ 3.4 కోట్ల రూపాయలకు అమ్ముడైంది.


ఇవి కూడా చదవండి

WhatsApp: వాట్సాప్‌లో మిమ్మల్ని బ్లాక్ చేశారా.. అయినా మెసేజ్ చేయచ్చు.. ఎలాగంటే..

Chatgpt Model Selection Guide: రకరకాల చాట్‌జీపీటీ మోడల్స్.. ఏది ఎప్పుడు ఎలా వాడాలో తెలుసా

Updated Date - Apr 27 , 2025 | 03:22 PM