Share News

Tiger Attack: థాయ్‌లాండ్ వెళ్లేవారికి హెచ్చరిక.. పులులతో జాగ్రత్తగా ఉండండి..

ABN , Publish Date - May 30 , 2025 | 05:26 PM

Tiger Attack: ఆ టూరిస్టు నేలపై కూర్చున్నాడు. గైడ్ తన చేతిలో ఉన్న ఐరన్ స్టిక్‌తో పులిని రెండు, మూడు సార్లు చిన్నగా కొట్టాడు. ఆ పులికి కోపం వచ్చింది. కింద కూర్చున్న టూరిస్టుపై విరుచుకుపడింది.

Tiger Attack: థాయ్‌లాండ్ వెళ్లేవారికి హెచ్చరిక.. పులులతో జాగ్రత్తగా ఉండండి..
Tiger Attack

థాయ్‌లాండ్‌లో టైగర్ పార్కులు చాలా ఫేమస్. థాయ్‌లాండ్ టూరుకు వెళ్లిన వారు టైగర్ పార్కుల్లోని పులులతో సెల్ఫీలు, ఫొటోలు, వీడియోలు తీసుకోవడానికి తెగ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఆ టైగర్ పార్కుల్లో పులులు స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. వాటిని మనం తాకవచ్చు.. ప్రేమగా నిమరవచ్చు.. కుదిరితే ముద్దాడవచ్చు కూడా. అయితే, కొన్నిసార్లు టూరిస్టులపై పులులు దాడి చేస్తూ ఉంటాయి. గాయపరుస్తూ ఉంటాయి. తాజాగా, ఇండియాకు చెందిన ఓ టూరిస్టుపై పులి దాడి చేసింది. అతడి మీద పడి మరీ గాయపర్చింది.


ఈ సంఘటన థాయ్‌లాండ్‌లోని ఫుకెట్ టైగర్ కింగ్‌డమ్‌లో చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇండియాకు చెందిన ఓ టూరిస్టు కొద్దిరోజుల క్రితం థాయ్‌లాండ్ టూరుకు వెళ్లాడు. పులులతో సరదాగా గడపడానికి.. ఫుకెట్‌లోని పులుల పార్కు ‘ టైగర్ కింగ్‌డమ్‌‘కు వెళ్లాడు. పెద్ద పులి మెడలో ఉన్న చైన్‌ను పట్టుకుని దానితో పాటు నడవసాగాడు. అతడితో పాటు గైడ్ కూడా ఉన్నాడు. కొంతదూరం పోయిన తర్వాత పులి ఆగింది. అప్పుడు గైడ్ ఆ టూరిస్టును కింద కూర్చోమన్నాడు.


టూరిస్టు నేలపై కూర్చున్నాడు. ఆ గైడ్ తన చేతిలో ఉన్న ఐరన్ స్టిక్‌తో పులిని రెండు, మూడు సార్లు చిన్నగా కొట్టాడు. ఆ పులికి కోపం వచ్చింది. కింద కూర్చున్న టూరిస్టుపై విరుచుకుపడింది. విచక్షణా రహితంగా దాడి చేసింది. పాపం ఆ టూరిస్టు ప్రాణ భయంతో గట్టిగట్టిగా కేకలు పెట్టాడు. గైడ్ ఎంతో కష్టం మీద పులిని పక్కకు తెచ్చాడు. చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు.. పులి దాడిలో టూరిస్టు బాగా గాయపడ్డాడు. పులి, టూరిస్టుపై దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కేడీ మంగలే అనే వ్యక్తి ఈ వీడియోపై స్పందిస్తూ.. ‘పులులకు వాటి నడుము కింది భాగంలో ముట్టుకోవటం నచ్చదు. అతడు అదే పనిగా దాని నడుము కింది భాగంలో తాకుతూ వచ్చాడు. అందుకే దానికి కోపం వచ్చి ఉంటుంది’ అని అన్నాడు.


ఇవి కూడా చదవండి

ఆర్సీబీ ఓడిపోతే భర్తకు విడాకులు ఇస్తుందట.. ఇదేం పిచ్చి..

ఐఎన్ఎస్ విక్రాంత్‌ పైనుంచి పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ వార్నింగ్

Updated Date - May 30 , 2025 | 05:56 PM