The Family Man: ఫ్యామిలీ మ్యాన్ నటుడి అనుమానాస్పద మృతి
ABN , Publish Date - Apr 29 , 2025 | 03:13 PM
The Family Man Season 3: అయితే, తమ కుమారుడు రోహిత్‌ది యాక్సిడెంట్ కాదని, మర్డర్ అని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. రంజిత్ బస్‌ఫోర్, అశోక్ బస్‌ఫోర్, ధరమ్ బస్‌ఫోర్‌లు తమ కుమారుడ్ని చంపేశారని అంటున్నారు. ఈ హత్యలో జిమ్ యజమాని అమరదీప్ హస్తం కూడా ఉందని ఆరోపిస్తున్నారు.

రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ‘ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ దేశ వ్యాప్తంగా ఎంతటి క్రేజ్ తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటి వరకు రెండు సీజన్లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. రెండింటికి మంచి స్పందన వచ్చింది. మనోజ్ బాజ్‌పాయ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సీజన్ 3 ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక, ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3లో నటించిన నటుడు రోహిత్ బస్‌ఫోర్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. అస్సాం, గువహటిలోని గర్భంగ వాటర్ ఫాల్స్ దగ్గర శవమై తేలాడు. సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
కొన్ని నెలల క్రితమే రోహిత్ ముంబై నుంచి గువహటికి వచ్చాడు. ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో అతడు స్నేహితులతో కలిసి బయటకు వెళ్లాడు. ఆ తర్వాతి నుంచి రోహిత్ తల్లిదండ్రులతో టచ్‌లో లేడు. కొన్ని గంటల తర్వాత రోహిత్ స్నేహితులు అతడి ఇంటికి ఫోన్ చేశారు. రోహిత్‌కు యాక్సిడెంట్ అయిందని, హాస్పిటల్‌కు తీసుకెళుతుండగా చనిపోయాడని తెలిపారు. అయితే, తమ కుమారుడు రోహిత్‌ది యాక్సిడెంట్ కాదని, మర్డర్ అని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. రంజిత్ బస్‌ఫోర్, అశోక్ బస్‌ఫోర్, ధరమ్ బస్‌ఫోర్‌లు తమ కుమారుడ్ని చంపేశారని అంటున్నారు.
ఈ హత్యలో జిమ్ యజమాని అమరదీప్ హస్తం కూడా ఉందని ఆరోపిస్తున్నారు. అతడే రోహిత్‌ను బయటకు తీసుకెళ్లాడని అన్నారు. ఇక, పోలీసులు రోహిత్ మృతదేహంపై గాయాలను గుర్తించారు. సోమవారం గువహటి మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌లో రోహిత్ మృతదేహానికి పోస్టుమార్టం జరిగింది. తల, ముఖం, ఇతర శరీర భాగాలపై గాయాలు ఉన్నట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. రోహిత్ తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేసిన నలుగురు వ్యక్తులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. పోలీసులు వారి కోసం అన్వేషిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
Actress: నటి ఇంట్లో భారీ చోరీ.. 34 లక్షల నగలు దోచేసిన పని మనిషి..
Habits That Stay You Poor: ఈ అలవాట్లు వదలకపోతే జీవితాంతం పేదవారిగానే ఉంటారు..