Thailand man: వదిలి వెళ్లిపోయిన భార్య.. భోజనం మానేసి వంద బీర్లు తాగిన భర్త.. చివరకు..
ABN , Publish Date - Jul 25 , 2025 | 08:53 PM
భార్య విడాకులు ఇవ్వడాన్ని అతడు తట్టుకోలేకపోయాడు. పూర్తిగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. భోజనం పూర్తిగా మానేశాడు. నెల రోజుల పాటు కేవలం బీర్లు మాత్రమే తాగాడు. దీంతో అతడి ఆరోగ్యం పూర్తిగా పాడైపోయి చివరకు ప్రాణాలు కోల్పోయాడు. థాయ్‌లాండ్‌లో ఈ ఘటన జరిగింది.

భార్య (Wife) విడాకులు (Divorce) ఇవ్వడాన్ని అతడు తట్టుకోలేకపోయాడు. పూర్తిగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. భోజనం పూర్తిగా మానేశాడు. నెల రోజుల పాటు కేవలం బీర్లు (Beers) మాత్రమే తాగాడు. దీంతో అతడి ఆరోగ్యం పూర్తిగా పాడైపోయి చివరకు ప్రాణాలు కోల్పోయాడు. థాయ్‌లాండ్ (Thailand)లో ఈ ఘటన జరిగింది. అతడి గదిలో వందకు పైగా బీర్ సీసాలు కనిపించాయి. ఈ ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
థాయ్‌లాండ్‌కు చెందిన థవీసక్ నమ్‌వోంగ్సా (44) అనే వ్యక్తికి అతడి భార్య ఇటీవల విడాకులు ఇచ్చింది. పదహారేళ్ల కొడుకును థవీసక్ దగ్గరే వదిలేసి వెళ్లిపోయింది. భార్య వెళ్లిపోవడంతో థవీసక్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. భార్యనే తలచుకుంటూ రోజంతా బీర్లు మాత్రమే తాగేవాడు. కొడుకు ఏదో ఒకటి వండి పెట్టి బతిమలాడినా తినేవాడు కాదు. దీంతో థవీసక్ అవయవాలు పనిచేయడం మానేశాయి. తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో ఓ స్వచ్ఛంద సేవా సంస్థకు చెప్పడంతో వారు థవీసక్‌ను హాస్పిటల్‌లో జాయిన్ చేయడానికి సిద్ధమయ్యారు.
ఆ సంస్థ సభ్యులు ఇంటికి వెళ్లేసరికి థవీసక్ మరణించాడు. దీంతో పోలీసులకు ఈ ఘటనపై సమాచారం అందించారు. థవీసక్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. థవీసక్ గదిలో వందకు పైగా బీరు సీసాలను పోలీసులు గుర్తించారు. మితిమీరిన మద్యపానం వల్లే థవీసక్ మరణించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు సాగిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
మీది డేగ చూపు అయితే.. ఈ అడవిలో చిరుతను 5 సెకెన్లలో కనిపెట్టండి..
వామ్మో.. ఇది ప్రమాదకరమైన డ్యాన్స్.. వేదికపై వరుడి డ్యాన్స్ చూస్తే షాకవ్వాల్సిందే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..