Share News

Movie News: తీవ్ర విషాదం.. బస్సులో ప్రయాణిస్తూ చనిపోయిన డైరెక్టర్..

ABN , Publish Date - Jun 02 , 2025 | 10:18 AM

Tamil Filmmaker: ఆ నిర్మాతకు కథ చెప్పి నిన్న మధురై నుంచి బస్సులో చెన్నై తిరుగు ప్రయాణం అయ్యాడు. ఈ నేపథ్యంలోనే సోమవారం తెల్లవారుజామున ఆయన కార్డియాక్ అరెస్ట్‌కు గురయ్యాడు.

Movie News: తీవ్ర విషాదం.. బస్సులో ప్రయాణిస్తూ చనిపోయిన డైరెక్టర్..
Tamil Filmmaker

నీకు ఈ సమాజం మీద.. జనాల మీద కోపంగా ఉందా?.. మనసులో బాధతో.. ఏదో తెలియని అసంతృప్తితో జీవితం నరకంలా గడుస్తోందా?.. ఒక సారి ఆలోచించు.. ఎప్పుడు పోతామో తెలీని జీవితం ఇది. ఎందుకంత ఆవేదన. నువ్వు ఏం సాధించినా.. ఎంత సంపాదించినా.. ప్రశాంతత లేని జీవితం నరకం లాంటిది. అందుకే ప్రశాంతంగా బతకటం నేర్చుకో.. చనిపోయేనాటికి కొంతైనా సంతోషంగా ఉంటావు. ఇదంతా నేనెందుకు చెబుతున్నానంటే.. పైన ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు విక్రమ్ సుగుమారన్.


తమిళ డైరెక్టర్. తీసింది రెండు సినిమాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన డైరెక్ట్ చేస్తున్న ఓ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఇలాంటి టైంలో ఆయన అనుకోని విధంగా ప్రాణాలు కోల్పోయాడు. బస్సులో కార్డియాక్ అరెస్ట్‌కు గురై చనిపోయాడు. ఈ విషాదకర సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. విక్రమ్ సుగుమారన్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా సినిమా కెరీర్ ప్రారంభించాడు. 1999నుంచి 2000 మధ్య కాలంలో బాలు మహేంద్ర దగ్గర పని చేశాడు.


‘మద యానయ్ కూటమ్’ సినిమాతో దర్శకుడిగా మారాడు. మొదటి సినిమాతోటే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ‘రావణ కూటమ్’ అనే సినిమా చేశాడు. ఈ సినిమా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ‘తీరమ్ పోరమ్’ అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఓ కొత్త సినిమా కోసం విక్రమ్ ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఓ ప్రొడ్యూసర్‌కు కథ చెప్పడానికి చెన్నై నుంచి మధురై వెళ్లాడు.


ఆ నిర్మాతకు కథ చెప్పి నిన్న మధురై నుంచి బస్సులో చెన్నై తిరుగు ప్రయాణం అయ్యాడు. ఈ నేపథ్యంలోనే సోమవారం తెల్లవారుజామున ఆయన కార్డియాక్ అరెస్ట్‌కు గురయ్యాడు. అక్కడికక్కడే బస్సులోనే ప్రాణాలు విడిచాడు. 47 ఏళ్ల వయసులో లోకాని విడిచి వెళ్లిపోయాడు. విక్రమ్ సుగుమారన్ మృతిపై ప్రముఖ నటుడు సంతు భాగ్యరాజ్, సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్ స్పందించారు. ఈ మేరకు ఎక్స్ ఖాతాల్లో పోస్టు పెట్టారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.


ఇవి కూడా చదవండి

నిలబడి నీళ్లు తాగితే కిడ్నీలపై ప్రభావం పడుతుందా..

పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు..

Updated Date - Jun 02 , 2025 | 11:15 AM