Tamil Actor Krishna: డ్రగ్స్ కేసులో ప్రముఖ నటుడు కృష్ణ అరెస్ట్
ABN , Publish Date - Jun 26 , 2025 | 06:59 PM
Tamil Actor Krishna: శ్రీకాంత్ 12 వేల రూపాయల విలువ చేసే కొకైన్ కొనుగోలు చేశారన్న ఆరోపణలు రావటంతో.. పోలీసులు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది.

కోలీవుడ్‌లో డ్రగ్స్ కేసు కలకలం రేపుతోంది. సినీ ప్రముఖులు వరుసగా అరెస్ట్ అవుతున్నారు. రెండు రోజుల క్రితం ప్రముఖ తమిళ హీరో శ్రీకాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను కోర్టులో హాజరుపర్చగా.. తాను డ్రగ్స్ తీసుకున్నానని అంగీకరించినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. హీరో శ్రీకాంత్ పోలీసుల విచారణ సందర్భంగా కృష్ణ ప్రస్తావన తెచ్చినట్లు సమాచారం. నటుడు కృష్ణతో కలిసి డ్రగ్స్‌కు సంబంధించిన పార్టీల్లో తరచుగా పాల్గొన్నానని శ్రీకాంత్ చెప్పారట.
ఇక, ఈ నేపథ్యంలోనే కృష్ణకు పోలీసులు సమన్లు పంపారు. అయితే, అరెస్ట్ భయంతో కృష్ణ కేరళ పారిపోయారు. దీంతో ఆయన్ని పట్టుకోవడానికి అధికారులు ఓ టీమ్‌ను ఏర్పాటు చేశారు. ఆ టీమ్ కృష్ణను వెతికి పట్టుకుని అరెస్ట్ చేసింది. అరెస్ట్ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ.. ‘నేను డ్రగ్స్‌కు బానిస కాలేదు. నేను గుండె, కడుపు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాను. నేను డ్రగ్స్ తీసుకోలేను’ అని స్పష్టం చేశారు. పోలీసులు ఆయనకు డ్రగ్స్ టెస్ట్ చేయించగా.. అందులో నెగిటివ్ వచ్చింది.
డ్రగ్స్ టెస్ట్‌లో నెగిటివ్ వచ్చినా పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. కృష్ణ ఫైనాన్షియల్ రికార్డులు, ఫోన్ యాక్టివిటీ, ఇది వరకే డ్రగ్స్ కేసులో అరెస్టయిన ప్రసాద్‌తో సంబంధాలపై ఆరా తీస్తున్నారు. కాగా, శ్రీకాంత్ 12 వేల రూపాయల విలువ చేసే కొకైన్ కొనుగోలు చేశారన్న ఆరోపణలు రావటంతో.. పోలీసులు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది. డ్రగ్స్ తీసుకున్నారని తేలటంతో సోమవారం చెన్నైలో పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. తీగలాగితే డొంక కదిలినట్టు ఏఐఏడీఎమ్‌కే నేత ప్రసాద్ అరెస్ట్‌తో శ్రీకాంత్ పేరు వెలుగులోకి వచ్చింది.
ఇవి కూడా చదవండి
కుబేర సినిమా చూస్తుండగా కూలిన థియేటర్ సీలింగ్
రీల్స్ చేస్తుండగా అనుకోని విషాదం.. పాపం యువతి..