Super Moon: డిసెంబర్ 4న ఆకాశంలో అద్భుతం!
ABN , Publish Date - Nov 29 , 2025 | 06:20 PM
డిసెంబర్ 4న సూపర్ మూన్ కనిపించనుంది. కోల్డ్ మూన్‌గా కూడా పిలుచుకునే ఇది 2025లో చివరి సూపర్ మూన్. సాధారణం కంటే మరింత నిండుగా, ప్రకాశవంతంగా కనిపించి ఆకాశంలో అద్భుత దృశ్యాన్ని అందించనుంది.
ఇంటర్నెట్ డెస్క్: ‘సూపర్ మూన్’ అనే ఈ పరిణామం.. చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చినప్పుడు జరుగుతోంది. డిసెంబర్ 4న నిండైన చందమామ ఆకాశంలో కనువిందు చేయనుంది. దీన్నే ‘కోల్డ్ మూన్’ అని కూడా అంటారు. 2025లో కనిపించే చివరి సూపర్ మూన్ కూడా ఇదే కావడం విశేషం. సాధారణం కంటే జాబిల్లి మరింత నిండుగా.. ప్రకాశవంతంగా కనిపిస్తుంది.
సూపర్ మూన్ అంటే?
నాసా పరిశోధనల ప్రకారం ‘సూపర్ మూన్’(Super Moon) అనే పదం అధికారిక ఖగోళ శాస్త్ర పదం కాదు. అయితే పౌర్ణమి రోజున చంద్రుడు భూమికి కనీసం 90 శాతం దూరంలో ఉన్నప్పుడు ఈ పదాన్ని ఉపయోగిస్తారు. దీన్ని ‘కోల్డ్ మూన్’ అని.. ‘లాంగ్ నైట్ మూన్’ అని కూడా పిలుస్తుంటారు. అక్టోబర్‌లో కనిపించిన హార్వెస్ట్ మూన్, నవంబర్‌లో కనిపించిన బీవర్ మూన్ తర్వాత వచ్చేదే ఈ లాంగ్ నైట్ మూన్ అన్నమాట.
కోల్డ్ మూన్ ప్రత్యేకత ఏంటంటే?
చంద్రుడు తన కక్ష్యలో భూమికి అత్యంత సమీపానికి చేరి పౌర్ణమి దశలో ఉన్నప్పుడు సూపర్ మూన్ ఏర్పడుతుంది. డిసెంబర్ 4న కనిపించే కోల్డ్ మూన్ ఈ ఏడాది ‘నిజమైన సూపర్‌మూన్’ ప్రమాణాలను పూర్తిగా అందుకుంటుంది. ఈ సమీకరణ వల్ల చంద్రుడు రాత్రి ఆకాశంలో అద్భుతంగా, స్పష్టంగా, అందంగా మెరిసిపోతాడు. కోల్డ్ మూన్‌ను వ్యక్తిగత అభివృద్ధికి సంకేతంగా భావిస్తారు.
ఎప్పుడు చూడొచ్చంటే?
పౌర్ణమి చంద్రుణ్ణి శ్రేష్ఠ దశలో రాత్రి ఎప్పుడైనా చూడొచ్చు. అయితే సంధ్యాకాలంలో ఆకాశ తీరానికి దగ్గరగా కనిపించినప్పుడు చంద్రుడు అతి పెద్దగా కనిపిస్తాడు. దీన్నే ‘మూన్ ఇల్యూషన్’ అంటారు. చందమామను తనివితీరా ఆస్వాదించాలనుకునే వారు విద్యుత్తు దీపాలకు దూరంగా.. మంచి ఓపెన్ ప్లేస్‌ను ఎంచుకోవడం ఉత్తమం. ఎలాంటి పరికరాలు అవసరం లేదు. బైనాక్యులర్ లేదా టెలిస్కోప్ ఉంటే ఇంకా బాగా చూసేందుకు ఆస్కారం ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
కచ్చితంగా టీమిండియాలోకి తిరిగొస్తా.. ఉమ్రాన్ మాలిక్ ఆశాభావం
పంత్‌ను చూసి నవ్వుకున్న ఫొటోగ్రాఫర్.. అసలేమైందంటే?