Sunita Williams Salary: సునీత విలియమ్స్ శాలరీ.. అంతరిక్షంలో ఓవర్ టైం.. పరిహారం ఎంతంటే..
ABN , Publish Date - Mar 19 , 2025 | 12:49 PM
నాసా వ్యోమగాములు సునీత, బుచ్ సురక్షితంగా భూమి మీదకు చేరుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మరి ఇంతకాలం అంతరిక్షంలో గడిపినందుకు వారి పారితోషికం ఎంతో తెలుసుకుందాం పదండి

ఇంటర్నెట్ డెస్క్: సునీత విలియమ్స్.. గత కొన్ని రోజులుగా ఎవ్వరి నోట విన్నా ఇదే మాట. ఆమె తిరుగు ప్రయాణం గురించి యావత్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురు చూసింది. సురక్షితంగా భూమిపై దిగగానే హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో సునీత గురించి జనాలు గూగుల్‌లో తెగ సెర్చ్ చేసేశారు. ఆమె ఎక్కడ జన్మించిందీ.. ఏం చదువుకున్నదీ.. జీతం ఎంత వంటి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే, ఇంతటి రిస్క్ తీసుకున్న సునీతకు నాసా ఎంత జీతం చెల్లిస్తోందనే ప్రశ్న అనేక మందికి తలెత్తింది. దీంతో, ఈ ప్రశ్నే గూగుల్ సెర్చ్ ఫలితాల్లో టాప్‌లో నిలిచింది. అంతేకాకుండా..భూమి చుట్టూ చెక్కర్లు కొట్టే ఐఎస్ఎస్‌లో ఉన్న సునీత ఎన్ని సార్లు భూప్రదక్షిణలు చేశారన్న సందేహం కూడా కొందరికి తలెత్తింది.
Also Read: త్వరలో భారత్‌కు సునీతా విలియమ్స్.. పర్యటన ఖరారు
జూన్ 5న సునీత విలియమ్స్, బుచ్ విల్‌మోర్ బోయింగ్‌కు చెందిన వ్యోమనౌక స్టార్‌లైనర్ ద్వారా అంతర్జాతీయ స్పేస్ స్టేషన్‌కు చేరుకున్నారు. ఈ మిషన్ 8 రోజుల్లో పూర్తి కావాల్సి ఉంది. కానీ స్టార్‌లైనర్‌లో సాంకేతిక లోపాల కారణంగా ఏకంగా 286 రోజులు ఐఎస్ఎస్‌లోనే సునీత, బుచ్ ఉండిపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో వారు భూమి చుట్టూ ఏకంగా 4576 చెక్కర్లు కొట్టారు. మొత్తం195 మిలియన్ కిలోమీటర్లు ప్రయాణించారు.
ఇంతటి ప్రమాదకరమైన యాత్ర చేసిన సునీత శాలరీ ఎంతో తెలుసుకునేందుకు జనాలు గూగుల్‌లో సెర్చ్ చేశారు. మీడియా కథనాల ప్రకారం, వ్యోమగామిగా సునీతకు జీఎస్ - 15 ర్యాంకు కేటాయించారు. అంటే అమెరికా ప్రభుత్వ ఉద్యోగుల్లో అత్యధిక జీతం ఆమె తీసుకుంటారన్నమాట. సునీత వార్షిక వేతనం 125,133 (రూ.1 కోటి) నుంచి 162,675 డాలర్ల (రూ.1.4 కోట్లు) మధ్య ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి, అధిక సమయం పని చేస్తే ఆ మేరకు పారితోషికం కూడా లభిస్తుంది. ఈసారి షెడ్యూల్‌కు మించి ఆమె అంతరిక్షంలో ఉన్నందుకు అదనంగా 93,950 డాలర్లు (రూ.80 లక్షలు) నుంచి 122,004 ( సుమారు రూ.1 కోటి) డాలర్ల వరకూ పారితోషికం ఉండొచ్చని సమాచారం. ఇక బుచ్‌కు కూడా ఇవే చెల్లింపులు వర్తిస్తాయట.
Also Read: భూమ్మీదకు సురక్షితంగా చేరిన సునీతా విలియమ్స్.. నెక్స్ట్ జరిగేది ఇదే..
ఇక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం 400 కిలోమీటర్ల ఎత్తులో భూమి చుట్టూ పరిభ్రమిస్తున్న విషయం తెలిసిందే. దీని వేగం గంటకు 27,600 కిలోమీటర్లు. ఇక ఐఎస్ఎస్‌లో గురుత్వాకర్షణ ప్రభావం ఉన్నప్పటికీ వ్యోమగాములు గాల్లో తేలుతున్నట్టు కనిపిస్తారు. అంటే.. ఒక లిఫ్ట్ అమితవేగంతో కిందకొస్తే అందులోని వారు గాల్లో తేలినట్టు వ్యోమగాముల పరిస్థితి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.