Share News

Success Story: అంధురాలని చెత్తకుప్పలో పడేసిన తల్లిదండ్రులు.. చివరకు..

ABN , Publish Date - Apr 22 , 2025 | 07:41 PM

25 సంవత్సరాల క్రితం పుట్టిన పసికందుకు చూపు లేదని కన్న తల్లిదండ్రులే ఆమెను చెత్త కుప్పలో పడేశారు.. కానీ, విధి ముందు ఆ యువతి తలవంచలేదు. చివరకు, అందరి చూపును తనవైపు తిప్పుకునేలా చేసింది. లోపాన్ని కూడా లెక్కచేయకుండా ఏకంగా కలెక్టరేట్‌లో రెవెన్యూ అసిస్టెంట్‌గా ఉద్యోగం సాధించింది.

Success Story: అంధురాలని చెత్తకుప్పలో పడేసిన తల్లిదండ్రులు.. చివరకు..
Mala Papalkar

Success Story Of Mala Papalkar :25 సంవత్సరాల క్రితం మహారాష్ట్రలోని జల్గావ్ రైల్వే స్టేషన్​ సమీపంలోని చెత్తకుప్పలో ఓ చిన్నారి కనిపించింది. ఆ పాప పుట్టుకతోనే అంధురాలు కావడంతో కన్న తల్లిదండ్రులే ఆ చిన్నారిని వద్దనుకుని చెత్తకుప్పలో పడేశారు. స్థానికుల సమాచారంతో అక్కడికి వెళ్లిన పోలీసులు ఆ చిన్నారి తల్లిదండ్రుల కోసం ఎంతగానో ప్రయత్నించారు. కానీ, వారికి ఆచూకీ దొరకలేదు. దీంతో పోలీసులు ఆ చిన్నారిని జల్గావ్​లోని రిమాండ్ హోమ్​కు తరలించారు. అంధుల అనాథాశ్రమంలో ఆ చిన్నారిని చేర్చించారు.


విధి ముందు తలవంచకుండా..

ఆ చిన్నారికి అనాథాశ్రమం వారే మాలా పాపల్కర్ అని పేరు పెట్టి నామకరణం చేశారు. ఆధార్ కార్డ్‌తో సహా అన్ని డాక్యుమెంట్లు సిద్ధం చేసి ఆ చిన్నారికి చదువుకు కావాల్సిన ఏర్పాట్లను చేశారు. బ్రెయిలీ లిపిలో తనకు చదువు నేర్పించారు. మాలాకు కొత్త విషయాలు తెలుసుకోవడమంటే చాలా ఆసక్తి. పట్టుదలతో కష్టపడి చదివే స్వాభావం. విధి ముందు తలవంచకుండా టెన్త్, ఇంటర్‌లోనూ మంచి మార్కులతో మాలా పాపల్కర్ ఉత్తీర్ణత సాధించింది. అమరావతిలోని విదర్భ జ్ఞాన్ విజ్ఞాన్ సంస్థలో ఆర్ట్స్‌లో డిగ్రీ చదివింది. చదువులో ఎప్పుడు ముందు ఉండే మాలా పాపల్కర్ ఎంతో కష్టపడి చదివి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం సాధించింది.

ప్రశంసలు

మహారాష్ట్రలోని జల్గావ్ రైల్వే స్టేషన్‌లో చెత్తబుట్టలో దొరికిన మాలా పాపల్కర్ ఇప్పుడు మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో ఉత్తీర్ణురాలై నాగ్‌పూర్ కలెక్టరేట్‌లో ఉద్యోగం సంపాదించింది. లోపాన్ని సైతం లెక్కచేయకుండా అందరి చూపు తనవైపు తిప్పుకుంది. పుట్టుకతోనే అంధురాలు అయినప్పటికీ, ఒక అనాథాశ్రమం సహాయంతో ఆమె తన కలను నెరవేర్చుకుంది. ఇప్పుడు అందరి ప్రశంసలు పొందుతుంది.


Also Read:

MS Dhoni: పచ్చి అబద్ధం.. అస్సలు నమ్మకండి.. ఫ్యాన్స్‌కు ధోని రిక్వెస్ట్

Health Tips: టాయిలెట్ మీద ఎంతసేపు కూర్చోవాలి.. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా..

Updated Date - Apr 22 , 2025 | 07:50 PM