Share News

Viral Video: భార్య అలా చేసిందని మెట్రో రైలు తగుల బెట్టాడు..

ABN , Publish Date - Jun 27 , 2025 | 03:07 PM

Viral Video: మంటల కారణంగా రైలులో పొగలు నిండుకున్నాయి. ఊపిరి ఆడక ప్రయాణికులు అల్లాడిపోయారు. ఐదుగురు వ్యక్తులు అస్వస్థతకు గురయ్యారు. కొన్ని నిమిషాల తర్వాత మెట్రో రైలు సిబ్బంది వచ్చి మంటల్ని ఆర్పేశారు.

Viral Video: భార్య అలా చేసిందని మెట్రో రైలు తగుల బెట్టాడు..
Viral Video

సౌత్ కొరియాలో ఓ దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. మెట్రో రైలులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి తన కంపార్ట్‌మెంట్‌లో పెట్రోల్ పోసి నిప్పంటించాడు. లోపల జనం ఉండగానే ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఆ వ్యక్తి చేసిన పని కారణంగా ప్రయాణికులు నరకం అనుభవించారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. సౌత్ కొరియా, సియోల్ సిటీకి చెందిన 67 ఏళ్ల వ్యక్తి మే 31వ తేదీన నల్ల బ్యాగుతో మెట్రో రైలు ఎక్కాడు. రైలు కొంత దూరం ప్రయాణించిన తర్వాత అతడు చుట్టూ చూశాడు. తనతో పాటు తెచ్చుకున్న బ్యాగులోంచి పెట్రోల్ బాటిల్ బయటకు తీశాడు.


ఆ వెంటనే బాటిల్‌లోని పెట్రోల్‌ను రైలు ఫ్లోర్‌పై చల్లాడు. దీంతో అక్కడున్న ప్రయాణికులంతా భయపడిపోయారు. అక్కడినుంచి పరుగులు తీశారు. ఈ నేపథ్యంలోనే ఓ మహిళ కిందపడిపోయింది. చెప్పులు, ఫోన్ అక్కడే వదిలి పెట్టేసి, బతుకు జీవుడా అంటూ పారిపోయింది. పాపం.. ఆమె మడమ విరిగింది. అయినా ఆగకుండా అక్కడినుంచి పరిగెత్తింది. ఇక, ప్రయాణికులందరూ అక్కడినుంచి పరిగెత్తిన తర్వాత.. ఆ వ్యక్తి పెట్రోల్‌కు నిప్పంటించాడు. ఆ ప్రాంతం మొత్తం పెద్ద మంటతో భగ్గుమంది.


మంటల కారణంగా రైలులో పొగలు నిండుకున్నాయి. ఊపిరి ఆడక ప్రయాణికులు అల్లాడిపోయారు. ఐదుగురు వ్యక్తులు అస్వస్థతకు గురయ్యారు. కొన్ని నిమిషాల తర్వాత మెట్రో రైలు సిబ్బంది వచ్చి మంటల్ని ఆర్పేశారు. ఇక, ఈ ప్రమాదంలో ఒకరు గాయపడగా.. మరో ఐదు మంది అస్వస్థతకు గురయ్యారు. ప్రాణ నష్టం సంభవించలేదు. రైలును తగలబెట్టిన వ్యక్తి అక్కడినుంచి తప్పించుకుని పారిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ దుండగుడి వెతికి పట్టుకున్నారు. కోర్టులో హాజరుపరిచారు. ఆ వ్యక్తి భార్య విడాకులు ఇచ్చిందన్న కారణంతో ఈ దారుణానికి పాల్పడినట్లు కోర్టుకు తెలిపాడు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఇవి కూడా చదవండి

తరచుగా ఆవలిస్తుంటే జాగ్రత్త.. మీ శరీరం చెప్పే ఆరోగ్య సంకేతాలు ఇవే!

వరసగా 7 రోజులు ఇలా చేస్తే.. పింపుల్స్ ఎప్పటికీ రావు..!

Updated Date - Jun 27 , 2025 | 04:58 PM