Share News

Shruti Haasan: లవ్ ఫెయిల్యూర్స్ గురించి స్పందించిన శృతి

ABN , Publish Date - Apr 27 , 2025 | 05:13 PM

Shruti Haasan Love Failures: తాజాగా, ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లవ్ ఫెయిల్యూర్స్ తల్లిదండ్రుల విడాకుల గురించి కూడా శృతి హాసన్ స్పందించారు. మా అమ్మానాన్న విడిపోయిన తర్వాత జీవితం తల్లకిందులు అయిపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Shruti Haasan: లవ్ ఫెయిల్యూర్స్ గురించి స్పందించిన శృతి
Shruti Haasan Love Failures

కమల్ హాసన్ కూతురిగా.. ఒక స్టార్ కిడ్‌గా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతి హాసన్.. తర్వాతి కాలంలో తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకుంది. సింగర్‌గా.. మ్యూజిక్ డైరెక్టర్‌గా.. హీరోయిన్‌గా తన సత్తా చాటుతోంది. సినిమాల్లో సక్సెస్ బాగానే ఉన్నా.. నిజ జీవితంలో రిలేషన్‌ల విషయంలో మాత్రం ఆమెకు ఫెయిల్యూర్స్ తప్ప .. సక్సెస్‌లు లేవనే చెప్పాలి. ఇప్పటి వరకు ఆమె ముగ్గురితో ప్రేమలో ఉంది. ఆ మూడు ప్రేమ కథలు పెళ్లి వరకు వెళ్లకుండానే ముగిసిపోయాయి. ఈ మూడు రిలేషన్స్‌తో శృతి హాసన్ మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ ఓ ట్రెండింగ్ టాపిక్‌గా నిలిచింది.


తాజాగా, ఈ లవ్ ఫెయిల్యూర్స్ గురించి శృతి హాసన్ ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు. ఆమె మాట్లాడుతూ.. ‘ ప్రతీ ఒక్కరి జీవితంలో ఓ ప్రమాదకరమైన మాజీ లవర్ ఉంటారు. నా విషయంలో మాత్రం అలా జరగలేదు. కానీ, ఎలాంటి ప్రశ్చాత్తాపం లేకుండానే నా బ్రేకప్స్ జరిగాయి. చాలా మంది అడుగుతుంటారు. నాకు ఎంత మంది ప్రియుళ్లు ఉన్నారని. వారికి సంబంధించినంత వరకు అది ఓ సంఖ్య మాత్రమే. ఆ బ్రేకప్స్ వల్ల.. నేను కోరుకున్న ప్రేమ నాకు దొరకలేదు అని అర్థం అవుతోంది. అందుకే వాటి విషయంలో నేను సిగ్గు పడటం లేదు. కానీ, ఎమోషనల్‌గా మాత్రం కొంత బాధ ఉంది.


నేను నా రిలేషన్స్‌లో చాలా నిజాయితీగా ఉన్నాను. ఆ రిలేషన్స్ ఫెయిల్ అయినపుడు నా లవర్స్‌ను తప్పుబట్టలేదు. నేను నా బ్రేకప్స్ నుంచి చాలా నేర్చుకున్నాను. అవి నా ఎదుగుదలకు ఉపయోగపడతాయి ’ అని అన్నారు. ఇక, ఇదే ఇంటర్వ్యూలో తల్లిదండ్రుల విడాకుల గురించి కూడా శృతి హాసన్ చెప్పుకొచ్చారు. ‘ నేను సినిమాల్లోకి రాకముందు నా జీవితంలో ఏం జరిగిందో చాలా మందికి తెలీదు. మా అమ్మానాన్న విడిపోయిన తర్వాత జీవితం తల్లకిందులు అయిపోయింది. చెన్నై నుంచి ముంబై వెళ్లిపోయాము. చాలా ఇబ్బందులు పడ్డాము. మెర్సెండెస్ బెంజ్ కారులో తిరిగే వాళ్లం.. లోకల్ ట్రైన్‌లో తిరిగే పరిస్థితి వచ్చింది’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి

Vijayapura News: సలహా ఇవ్వడమే భర్తకు శాపంగా మారింది..

Mahesh Babu: ఈడీ నోటీసులు.. సమయం కోరిన మహేష్ బాబు

Updated Date - Apr 27 , 2025 | 05:13 PM