Share News

Samantha Net Worth: సమంత లగ్జరీ లైఫ్.. నెట్ వర్త్ ఎంతో తెలుసా?

ABN , Publish Date - Dec 02 , 2025 | 05:20 PM

పెళ్లి సందర్భంగా సమంత ధరించిన రింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డైమండ్ పొదిగిన ఆ రింగ్ ధర 1.5 కోట్ల రూపాయలు ఉంటుందని తెలుస్తోంది. సమంత దగ్గర కోట్లు విలువ చేసే కార్లు.. అత్యంత లగ్జరీ గృహాలు ఉన్నాయి.

Samantha Net Worth: సమంత లగ్జరీ లైఫ్.. నెట్ వర్త్ ఎంతో తెలుసా?
Samantha Net Worth

సౌత్ సూపర్ స్టార్ సమంత, ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు నిన్న(సోమవారం) పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్‌లో ఉన్న లింగ భైరవీ గుడిలో వీరి పెళ్లి అతి కొద్దిమంది బంధుమిత్రుల మధ్య జరిగింది. ఈ సందర్భంగా సమంత ధరించిన రింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డైమండ్ పొదిగిన ఆ రింగ్ ధర 1.5 కోట్ల రూపాయలు ఉంటుందని తెలుస్తోంది. ఇక, సమంత దగ్గర కోట్లు విలువ చేసే కార్లు.. అత్యంత లగ్జరీ గృహాలు ఉన్నాయి.


పలు జాతీయ మీడియాల కథనం ప్రకారం.. 2025 సంవత్సరానికి గానూ సమంత ఆస్తుల విలువ 100 నుంచి 110 కోట్ల రూపాయలుగా ఉంది. సమంత సినిమాల నుంచే ఎక్కువ సంపాదిస్తోంది. ఆమె సినిమాకు 3 నుంచి 5 కోట్ల రూపాయలు తీసుకుంటోంది. బ్రాండ్ ప్రమోషన్ల నుంచి కూడా ఎక్కువ మొత్తంలో సంపాదిస్తోంది. కేవలం ప్రమోషన్ల ద్వారానే సంవత్సరానికి 8 కోట్ల రూపాయల దాకా సంపాదిస్తోంది.


రియల్ ఎస్టేట్ రంగంలో కూడా సమంత పెట్టుబడులు పెడుతోంది. ఆమెకు హైదరాబాద్‌లో లగ్జరీ డూప్లెక్స్ ఇళ్లు ఉంది. దాని ధర 7.8 కోట్ల రూపాయలుగా తెలుస్తోంది. ముంబైలో ఉన్న సీ ఫేసింగ్ త్రీ బీహెచ్‌కే ఇళ్లు ధర 15 కోట్ల రూపాయలుగా తెలుస్తోంది. సమంతకు ‘సీక్రెట్ ఆల్కమిస్ట్’ అనే సొంత పర్‌ఫ్యూమ్ బ్రాండ్ ఉంది. ఆమెకు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం.


సమంత దగ్గర ఉన్న లగ్జరీ కార్లు..

  • ఆడీ క్యూ7. ధర 89.90 లక్షల రూపాయలు.

  • పోర్చ్ కేమ్యాన్. ధర 1.46 కోట్ల రూపాయలు.

  • ల్యాండ్ రోవర్. ధర 2.26 కోట్ల రూపాయలు.

  • మెర్సెండెస్ బెంజ్ జీ63 ఏఎమ్‌జీ. ధర 2.55 కోట్ల రూపాయలు.

  • బీఎండబ్ల్యూ 7 సిరీస్. ధర 1.42 కోట్ల రూపాయలు.

  • జాగ్వార్ ఎక్స్ఎఫ్. ధర 76 లక్షల రూపాయలు.


ఇవి కూడా చదవండిః

అమ్మ మందు తాగడానికి వెళ్లింది.. కంటతడి పెట్టిస్తున్న పసి పిల్లల వీడియో..

థ్రిల్లింగ్ వీడియో.. అనకొండను వేటాడడం అంత ఈజీ కాదు.. చిరుత పరిస్థితి చూడండి..

Updated Date - Dec 02 , 2025 | 05:33 PM