Share News

Hollywood Walk of Fame: హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్.. దీపిక కంటే ముందు ఆ భారతీయ నటుడు

ABN , Publish Date - Jul 04 , 2025 | 08:56 AM

Hollywood Walk of Fame: హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్‌‌లో చోటు దక్కించుకున్న మొదటి ఇండియన్ దీపిక కాదు. అంతకంటే ముందు భారతీయ మూలాలు ఉన్న ఓ వ్యక్తి ‌హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్నారు. ఆయనే సాబు దస్తగిర్.

Hollywood Walk of Fame: హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్.. దీపిక కంటే ముందు ఆ భారతీయ నటుడు
Hollywood Walk of Fame

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ‘హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్‌‌’లో ప్రముఖ హీరోయిన్‌ దీపిక పదుకొనెకు చోటు దక్కిన సంగతి తెలిసిందే. బుధవారం రాత్రి హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ క్లాస్ ఆఫ్ 2026 లిస్ట్ విడుదల అయింది. ఆ లిస్టులో భారతీయ నటి దీపిక పదుకొనెకు చోటు దక్కటంతో హర్షం వ్యక్తం అవుతోంది. హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్‌‌లో చోటు దక్కించుకున్న తొలి భారతీయురాలిగా దీపిక రికార్డు సృష్టించారు. దీపిక సైతం దీనిపై సోషల్ మీడియా ద్వారా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆమె తన ‌ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ స్టోరీ పెట్టారు. హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్‌‌లో తనకు చోటు దక్కటం గౌరవంగా భావిస్తున్నానని ఆమె పేర్కొన్నారు.


దీపిక కంటే ముందు ఆయనే..

హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్‌‌లో చోటు దక్కించుకున్న మొదటి ఇండియన్ దీపిక కాదు. అంతకంటే ముందు భారతీయ మూలాలు ఉన్న ఓ వ్యక్తి ‌హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్నారు. ఆయనే సాబు దస్తగిర్. ఈయన పేరు రికార్డుల్లోకి ఎక్కటం కాదు.. ఈయనే పేరు మీదే రికార్డులు ఉన్నాయి. హాలీవుడ్ సినిమాల్లో నటించిన తొలి భారతీయుడు సాబు దస్తగిర్ కావటం విశేషం. అంతేకాదు.. హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్‌‌లో చోటు దక్కించుకున్న తొలి భారతీయుడు కూడా ఆయనే.


13 ఏళ్ల వయసులోనే ఆయన హాలీవుడ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 1930 నుంచి 1949 వరకు అక్కడ సినిమాలు చేశారు. మొదటి సినిమా ‘ఎలిఫెంట్ బాయ్’తో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకోవటమే కాదు.. ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు. తక్కువ సమయంలో ఎక్కువ సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ది డ్రమ్, తీఫ్ ఆఫ్ బాగ్దాద్, జంగిల్ బుక్, ఆరేబియన్ నైట్స్, కోబ్రా ఉమ్యాన్, సాంగ్ ఆఫ్ ఇండియా సినిమాల్లో నటించారు. ఆయన ఓ ఇండియన్ అయినప్పటికి ఒక్క భారతీయ సినిమాలో కూడా నటించలేదు.


బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా మదర్ ఇండియాలో లీడ్ రోల్ చేసే అవకాశం వచ్చినా కాదన్నారు. ఆ పాత్రను సునీల్ దత్ చేశారు. 1960లో హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్‌లో సాబుకు చోటు దక్కింది. ఎవ్వరూ ఊహించని విధంగా 1963, డిసెంబర్ 2వ తేదీన సాబు గుండె పోటు కారణంగా మరణించారు. ఆయన చివరగా నటించిన ‘ఏ టైగర్ వాల్క్స్’ 1964 మార్చి నెలలో విడుదల అయింది.


ఇవి కూడా చదవండి

పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు..

చదువుకోసం చిన్నారుల సాహసం.. ప్రాణాలకు తెగించి..

Updated Date - Jul 04 , 2025 | 09:30 AM