Tanushree Dutta Slams Troll: నెటిజన్‌కు అదిరిపోయేలా కౌంటర్ ఇచ్చిన హీరోయిన్
ABN , Publish Date - Jul 27 , 2025 | 03:49 PM
Tanushree Dutta Slams Troll: తనుశ్రీ దత్తా షేర్ చేసిన ఆ వీడియో కాస్తా కాంట్రవర్సీకి తెర తీసింది. కొంతమంది నెటిజన్లు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘శ్రావణమాస ఉపవాసం తర్వాత ఎవరైనా మటన్ తింటారా? ఛీ’ అంటూ మండిపడుతున్నారు.

హీరోయిన్ తనుశ్రీ దత్తా గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. 2005లో విడుదలైన బాలయ్య బాబు సినిమా ‘వీరభద్రుడు’తో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా.. కాంట్రవర్సీలకు దగ్గరగా జీవితాన్ని కొనసాగిస్తోంది. తాజాగా ఆమె శ్రావణమాస ఉపవాసం ఉంది. ఉపవాసం ముగిసిన తర్వాత మేక మాంసాన్ని ఆహారంగా తీసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.
ఆ వీడియో కాస్తా కాంట్రవర్సీకి తెర తీసింది. కొంతమంది నెటిజన్లు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘శ్రావణమాస ఉపవాసం తర్వాత ఎవరైనా మటన్ తింటారా? ఛీ’..‘ఉపవాసం తర్వాత మాంసం తినటం ఏంటి తల్లీ.. నీకసలు బుద్ధుందా?’..‘ప్రపంచంలో ఎక్కడా లేని ఉపవాసం ఈమెనే చేస్తోంది. అందుకే కావచ్చు. ఆకలి తట్టుకోలేక మాంసం తింటోంది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఓ వ్యక్తి మరింత వెటకారంగా ఇంగ్లీష్‌లో ‘శ్రావణ్ ఫాస్ట్.. మటన్ ఫ్యాట్’ అంటూ కామెంట్ పెట్టాడు.
ఈ కామెంట్‌పై తనుశ్రీ దత్తా స్పందించారు.‘పశ్చిమ బెంగాల్‌లో అందరి ఉపవాసాలు ఇలానే ముగుస్తాయి. సాయంత్రం వరకు మేము కేవలం నీళ్లు తాగి ఉపవాసం ఉంటాం. సూర్యాస్తమయం తర్వాత దేవతకు పెట్టిన మేక మాంసాన్ని(భోగ్) తింటాం. అందరి సాంప్రదాయాలు ఒకేలా ఉండవు. ముందు మొత్తం వీడియో చూడు. తర్వాత కామెంట్ చేయ్’ అని పేర్కొంది. మరో పోస్టులో ‘వచ్చారండి మతాన్ని ఉద్దరించే వీరులు. మీరూ.. మీ చెత్త ఆటిట్యూడ్’ అంటూ తీవ్ర స్థాయిలో మండిపడింది.
ఇవి కూడా చదవండి
ఎంతకు తెగించార్రా.. ఆడాళ్ల స్కీమ్‌లో మగాళ్లు..
న్యూరోసర్జన్ల హెచ్చరిక.. ఈ ఫుడ్స్ తింటే మీ బ్రెయిన్ ఖతం