Share News

Darshan Fans: రోజు రోజుకు పెచ్చు మీరుతున్న దర్శన్ ఫ్యాన్స్ ఆగడాలు..

ABN , Publish Date - Jul 30 , 2025 | 05:10 PM

Darshan Fans: ఫ్యాన్ రేణుకాస్వామి మర్డర్ కేసులో దర్శన్ గత సంవత్సరం జైలుకు వెళ్లారు. ఈ ఏడాది బెయిల్‌పై బయటకు వచ్చారు. రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ తీరును కన్నడ చిత్ర పరిశ్రమలోని చాలా మంది తప్పుబట్టారు.

Darshan Fans: రోజు రోజుకు పెచ్చు మీరుతున్న దర్శన్ ఫ్యాన్స్ ఆగడాలు..
Darshan Fans

శాండల్‌‌వుడ్ స్టార్ హీరో దర్శన్ ఫ్యాన్స్ ఆగడాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తమ హీరోను ఏమన్నా అంటే దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఆఖరికి యశ్, సుదీప్ వంటి స్టార్ హీరోల కుటుంబసభ్యుల్ని కూడా వదల్లేదు. గత కొంతకాలంనుంచి స్టార్ హీరోయిన్, మాజీ ఎంపీ రమ్యను టార్గెట్ చేసి అసభ్యకామెంట్లు పెడుతున్నారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే నటుడు, బిగ్‌బాస్ కన్నడ 4 విన్నర్ ప్రథమ్ కూడా దర్శన్ ఫ్యాన్స్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్శన్ ఫ్యాన్స్ తనను కిడ్నాప్ చేసి బెదిరించారని మంగళవారం ఇచ్చిన కంప్లైంట్‌లో పేర్కొన్నాడు.


ప్రథమ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను జులై 22వ తేదీన దొడ్డబళ్లాపూర్‌లో ఉన్న యల్లమ్మ గుడికి వెళ్లాను. బేకరీ రఘు, అతడి అనుచరులు కత్తులతో నన్ను బెదిరించారు. నన్ను కిడ్నాప్ చేశారు. దర్శన్‌తో జైలులో తీసుకున్న ఫొటో రఘు నాకు చూపించాడు. దర్శన్‌ను ఏమన్నా అంటే చంపుతామని బెదిరించాడు. నేను వాళ్లనుంచి ఎంతో కష్టం మీద తప్పించుకుని బయటపడ్డాను. అది చాలా సీరియస్ సంఘటన. నేను ఎస్పీ ఆఫీస్ దగ్గర ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను. దర్శన్ ఈ విషయలో కలుగ జేసుకోవాలి.


ఆయన ఫ్యాన్స్ ఇతర నటుల్ని తిట్టడం, బెదిరించటం వంటివి ఆపాలని ఆయనే స్వయంగా చెప్పాలి’ అని అన్నాడు. కాగా, ఫ్యాన్ రేణుకాస్వామి మర్డర్ కేసులో దర్శన్ గత సంవత్సరం జైలుకు వెళ్లారు. ఈ ఏడాది బెయిల్‌పై బయటకు వచ్చారు. రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ తీరును కన్నడ చిత్ర పరిశ్రమలోని చాలా మంది తప్పుబట్టారు. ఈ నేపథ్యంలోనే ఆయనపై విమర్శలు చేశారు. దీంతో దర్శన్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా వారిపై విరుచుకుపడుతున్నారు. బూతులు తిడుతూ రెచ్చిపోతున్నారు.


ఇవి కూడా చదవండి

అదృష్టం అంటే ఈమెదే.. కొంచెం ఉంటే ప్రాణాలు పోయేవి..

యువకుడి దుస్సాహసం.. స్పై కెమెరాతో జగన్నాథుడి గుడిలోకి..

Updated Date - Jul 30 , 2025 | 05:10 PM