Fauji Actress Imanvi: పుకార్లపై స్పందించిన ప్రభాస్ హీరోయిన్
ABN , Publish Date - Apr 24 , 2025 | 04:29 PM
Pahalgam Terror Attack: సీతారామం దర్శకుడు హనురాఘవ పూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఫౌజీ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఇమాన్వీ హీరోయిన్‌గా చేస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఇమాన్వీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలోనే ప్రభాస్ ఫౌజీ హీరోయిన్ ఇమాన్వీపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇమాన్వీ కుటుంబానికి పాకిస్తాన్ ఆర్మీతో సంబంధాలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆమెను ఫౌజీ సినిమా నుంచి తీసేయాలంటూ కొంతమంది నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇమాన్వీ స్పందించారు. పాకిస్తాన్ ఆర్మీతో తన కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. తనది కూడా భారత రక్తమేనంటూ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ సుధీర్ఘ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో..
‘ ముందుగా.. పహల్గామ్ ఉగ్రదాడిలో చనిపోయిన వారికి నా ప్రగాఢ సంతాపం. నేను ఈ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. నాపై వస్తున్న పుకార్ల గురించి కూడా మాట్లాడాలనుకుంటున్నాను. మా ఇంట్లో వాళ్లకు ఎవ్వరికీ పాకిస్తాన్ ఆర్మీతో ఎలాంటి సంబంధం లేదు. సోషల్ మీడియా, మీడియాలో నాపై తప్పుడు ప్రచారం జరుగుతోంది. నేను ఇండియన్ అమెరికన్‌ని. హిందీ, తెలుగు, గుజరాతి, ఇంగ్లీష్ భాషలు మాట్లాడతాను. నేను లాస్ ఏంజిల్స్‌లో పుట్టాను. మా అమ్మానాన్న యుక్త వయస్సులో ఉన్నపుడే అమెరికాకు వచ్చేశారు. నేను చదివింది మొత్తం అమెరికాలోనే.. నటన, కొరియోగ్రఫీ, డ్యాన్స్ శిక్షణ కూడా అమెరికాలోనే తీసుకున్నాను. ఇండియన్ సినిమాలో పని చేసే అవకాశం వచ్చినందుకు సంతోషిస్తున్నాను. ఇండియన్ సినిమా ప్రభావం నా జీవితంపై చాలా ఉంది. నాది కూడా భారత రక్తమే. మీడియాను, సోషల్ మీడియాను అందరినీ కలపడానికి వాడండి.. విడగొట్టడానికి కాదు’ అంటూ మండిపడ్డారు.
తెలుగు వికిపీడియాలో ఇలా..
ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న తెలుగు వికిపిడియా వివరాల ప్రకారం.. ఇమాన్వీ పూర్తి పేరు ఇమాన్వీ ఇస్మాయిల్. ఆమె 1995 అక్టోబర్ 20వ తేదీన పాకిస్తాన్‌లోని కరాచీలో పుట్టింది. ఆమె తండ్రి ఇక్బాల్ ఇస్మాయిల్ పాకిస్తాన్ సైనిక అధికారి. ఎనిమిదేళ్ల వయసులో ఆమె తల్లిదండ్రులతో కలిసి కాలిఫోర్నియా వెళ్లింది. ఈ మొత్తం వివరాలను ఓ ప్రముఖ నేషనల్ మీడియా ఇచ్చిన వార్త ఆధారంగా ఎడిట్ చేశారు. సదరు నేషనల్ మీడియా రాసిన వార్తలో ఇమాన్వి కుటుంబం గురించి అర్థంకాని విషయాలు చాలానే ఉన్నాయి. ఇమాన్వీ ఇప్పుడు క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో అదంతా తప్పుడు సమాచారం అని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
Pahalgam Terror Attack: ఉగ్రవాదుల్లో ఇద్దరు పాకిస్తానీలు.. వారి గురించి చెబితే 20 లక్షల రివార్డ్
Pahalgam Terror Attack: ఉగ్రదాడి.. అవే రక్తపు బట్టలతో అంత్యక్రియలకు కూతురు..