Share News

Pooja Hegde: ఆ విషయంలో పూజా హెగ్డేకు కుటుంబం నుంచి ఒత్తిడి

ABN , Publish Date - Apr 17 , 2025 | 01:39 PM

Pooja Hegde: పూజ హెగ్డే చివరగా ఎఫ్ 3లో ఓ స్పెషల్ సాంగులో మెరిసింది. తర్వాతి నుంచి ఒక్క తెలుగు సినిమా కూడా చేయలేదు. ప్రస్తుతం హిందీ, తమిళ భాషల్లో ఆమె నటిస్తున్న సినిమాలు శరావేగంగా షూటింగులు జరుపుకుంటూ ఉన్నాయి.

Pooja Hegde: ఆ విషయంలో పూజా హెగ్డేకు కుటుంబం నుంచి ఒత్తిడి
Pooja Hegde

కన్నడ బ్యూటీ పూజా హెగ్డే తెలుగులో సినిమా చేసి చాలా ఏళ్లు అయిపోయింది. 2022లో ఆచార్య సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన ఈ అమ్మడు.. అదే సంవత్సరం ఎఫ్ 3లో ఓ స్పెషల్ సాంగులో మెరిసింది. తర్వాతినుంచి తెలుగు తెరవైపే చూడలేదు. అసలు తెలుగులో అవకాశాలు రావటం లేదా?.. లేక వచ్చిన అవకాశాలను ఆమే కాదంటోందా? అన్న విషయం తెలియటం లేదు. పూజా వికిపీడియాలోని ఫిల్మోగ్రఫీ ప్రకారం.. ఆమె నటిస్తున్న ఐదు సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. వాటిలో కొన్ని ఈ సంవత్సరం విడుదల అవ్వనుంటే.. మరికొన్ని వచ్చే సంవత్సరం విడుదల కానున్నాయి. వాటిలో ఒక్కటి కూడా తెలుగు సినిమాలేదు.


కుటుంబం నుంచి ఒత్తిడి..

పూజా హెగ్డే మాతృ భాష కన్నడ అని అందరికీ తెలిసిన విషయమే. ఆమె ఫ్యామిలీ కర్ణాటకలోనే ఉంది. సినిమా కెరీర్ మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు ఆమె ఒక్క కన్నడ సినిమా కూడా చేయలేదు. ఇదే ఆమె ఫ్యామిలీకి నచ్చటం లేదు. మాతృ భాషలో ఒక్క సినిమా అయినా చేయాలంటూ కుటుంబసభ్యులు ఆమెపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ విషయంపై ఆమె తాజాగా మీడియాతో మాట్లాడారు.. ‘ నా ఫ్యామిలీ నాపై బాగా ఒత్తిడి తెస్తోంది. నాది కర్ణాటక. నేను తులు అమ్మాయిని. మా అమ్మానాన్న నేను కన్నడలో సినిమా చేయాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. నేను ఇప్పటి వరకు తెలుగు, తమిళం, హిందీ సినిమాలు చేశాను.


కొన్ని కన్నడ సినిమా కథలు కూడా విన్నాను. కానీ, నాకు అవి నచ్చలేదు. నాకు మంచి కథ దొరికితే.. కచ్చితంగా కన్నడ సినిమాలో నటిస్తాను. మా అమ్మానాన్న తరచుగా ఇదే విషయం గురించి చెబుతూ ఉన్నారు. నాకు మరాఠీ లాంటి లోకల్ భాషల్లో కూడా సినిమాలు చేయాలని ఉంది’ అని అంది. కాగా, పూజా హెగ్డే 2012లో విడుదలైన ‘మూగమూడి’ అనే తమిళ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. రెండు సంవత్సరాల తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె నటించిన ‘ఒక లైలా కోసం’ అనే సినిమా 2014 విడుదల అయింది. అల వైకుంఠపురం సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది.


ఇవి కూడా చదవండి

తనకు ఆ రోగం ఉందని తెలిసి భార్యను చంపేశాడు..

BCCI: అభిషేక్ నాయర్.. టీ దిలీప్‌లకు ఊహించని షాక్..

Updated Date - Apr 17 , 2025 | 01:50 PM