Nani: బాలీవుడ్ చిత్ర పరిశ్రమపై కీలక వ్యాఖ్యలు చేసిన హీరో నాని
ABN , Publish Date - Apr 27 , 2025 | 08:25 PM
Nani Comments On Bollywood: నాని గత ఏడాది ‘ సరిపోదా శనివారం’ అనే సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించారు. వివేక్ ఆత్రేయ దర్వకత్వం వహించిన ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ వచ్చింది. నాని నటించిన హిట్ 3 సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. స్టార్ హీరోగా మారారు న్యాచురల్ స్టార్ నాని. తన నటనతో తెలుగు ప్రేక్షకుల్నే కాకుండా ఇతర భాషా ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకుంటున్నారు. కొత్త వారికి దర్శకుడిగా అవకాశం ఇచ్చి.. బ్లాక్ బాస్టర్ హిట్లు కొడుతున్నారు. కథల ఎంపికల విషయంలోనూ నాని ఇతర హీరోల కంటే భిన్నంగా వ్యవహరిస్తున్నారు. కేవలం హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా సక్సెస్ అందుకుంటున్నారు. తాజాగా, బాలీవుడ్ చిత్ర పరిశ్రమ పరిస్థితిపై నాని కీలక వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్‌కు గడ్డు కాలం నడుస్తోందన్నారు. త్వరలో బాలీవుడ్ కమ్ బ్యాక్ ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఓ ఇంటర్వ్యూలో నాని మాట్లాడుతూ.. ‘ తెలుగు సినిమా దెబ్బలు తిన్న సందర్భాలు కూడా ఉన్నాయి. గత వేసవిలో సినిమా థియేటర్లు మూసుకునే పరిస్థితి వచ్చింది. పీక్ సీజన్ అయిండి.. ఒక్క సినిమా కూడా వర్కవుట్ అవ్వలేదు. మేము దాన్నుంచి బయటపడి .. ముందుకంటే దృఢంగా కమ్ బ్యాక్ ఇచ్చాము. ప్రస్తుతం హిందీ చిత్ర పరిశ్రమ విషయంలోనూ అదే జరుగుతోంది. సినీ ప్రేక్షకులు సినిమా ఏ భాషదని పట్టించుకోవటం లేదు. ఒకప్పుడు బాలీవుడ్ అద్భుతమైన సినిమాలు చేసింది. కొన్ని తరాలకు స్పూర్తిగా నిలిచింది. పూర్వ వైభవం తప్పుకుండా వస్తుంది’ అని ఆశాభావం వ్యక్తం చేశారు.
నాని సినిమా సంగతులేంటంటే..
నాని గత ఏడాది ‘ సరిపోదా శనివారం’ అనే సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించారు. వివేక్ ఆత్రేయ దర్వకత్వం వహించిన ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ వచ్చింది. నాని నటించిన హిట్ 3 సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 1వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే నాని సినిమా ప్రమోషన్ కోసం దేశం మొత్తం చుడుతున్నారు. దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని ‘ది ప్యారడైజ్’ అనే సినిమా తీస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరావేగంగా సాగుతోంది. ఈ సినిమా 2026లో విడుదల అయ్యే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి
K Ramakrishna Rao IAS: బ్రేకింగ్ .. తెలంగాణ కొత్త సీఎస్‌గా కే రామకృష్ణారావు
UPSC Aspirant: ఐఏఎస్ ఆఫీసర్ పాడుబుద్ధి బయట పెట్టిన యువతి