Share News

Nandini Agarwal: 19 ఏళ్ల వయసులోనే CA.. ప్రపంచంలోనే..

ABN , Publish Date - Apr 29 , 2025 | 04:00 PM

ఓ యువతికి యూట్యూబ్‌లో రెండు లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్లు. నిత్యం చార్టర్డ్ అకౌంటెంట్ పరీక్షల గురించి, అధ్యయనల గురించి కొన్ని టిప్స్ చెప్తూ వీడియోలు చేస్తోంది. అయితే, ఆమె ప్రపంచలోనే..

Nandini Agarwal: 19 ఏళ్ల వయసులోనే  CA.. ప్రపంచంలోనే..
Charted Account Nandini Agarwal

Charted Account Nandini Agarwal: భారతదేశంలో చార్టర్డ్ అకౌంటెంట్ కావడం చిన్న విషయం కాదు. ఇది దేశంలోని అత్యంత కఠినమైన పరీక్షలలో ఒకటి. సాధారణంగా CA పాస్ కావడానికి, దీనిని పూర్తి చేయడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. CAలో పాస్ అయ్యారంటేనే చాలా గొప్ప సంగతి. అయితే, మధ్యప్రదేశ్‌లోని మోరెనా పట్టణానికి చెందిన ఒక యువతి 19 సంవత్సరాల వయస్సులోనే CAని కంప్లీట్ చేసి ఫస్ట్ ర్యాంక్‌ను సాధించింది. అంతేకాకుండా, 2021లో ప్రపంచంలోనే CA సాధించిన అతి పిన్న వయస్కురాలిగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌ తనను తాజాగా అధికారికంగా గుర్తించింది.

Nandini (1).jpg


ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్

అక్టోబర్ 18, 2001న జన్మించిన నందిని అగర్వాల్, 2021లో అతి పిన్న వయస్కురాలైన చార్టర్డ్ అకౌంటెంట్‌గా రికార్డు సృష్టించారు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రకారం దేశవ్యాప్తంగా జరిగిన పరీక్షలో ఫస్ట్ ర్యాంక్ సాధించారు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రకారం, ఆమె జూలై 2021లో తన చివరి CA పరీక్షకు హాజరై 19 సంవత్సరాల, 8 నెలల, 18 రోజుల వయస్సులో 1వ ర్యాంక్‌ను సాధించి అందరికీ అదర్శంగా నిలిచారు.

అతిపెద్ద కార్పొరేట్ కంపెనీలలో

ఆమె తన లింక్డ్ఇన్ బయోలో, చార్టర్డ్ అకౌంటెంట్ (బీకాం తో) 19 సంవత్సరాల వయసులో CA ఫైనల్స్‌లో AIR 1, 16 సంవత్సరాల వయసులో CA ఇంటర్‌లో AIR 31 సాధించి జాతీయ రికార్డు సృష్టించారు. PwC తో ఆర్టికల్ ట్రైనీగా తన కార్పొరేట్ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఎంతో నైపుణ్యం కలిగిన వారితో పనిచేశారు. చట్టబద్ధమైన ఆడిట్‌లు, గ్రూప్ రిపోర్టింగ్, రెఫర్డ్ రిపోర్టింగ్, IFRS అసైన్‌మెంట్‌లు, టాక్స్ ఆడిట్‌లు, ఫోరెన్సిక్ ఆడిట్‌లలో పనిచేసిన మూడు సంవత్సరాల అనుభవం తనకు ఉందని పేర్కొన్నారు. అగర్వాల్ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (BCG)లో ఒకటిన్నర సంవత్సరాలు అసోసియేట్ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్‌గా పనిచేశారు. BCGలోని G20 బృందంలో కూడా భాగమని ఆమె లింక్డ్ఇన్ తెలిపింది. ప్రస్తుతం, ఆమె ప్రైవేట్ ఈక్విటీ విశ్లేషకురాలిగా పనిచేస్తున్నారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని అతిపెద్ద కార్పొరేట్ కంపెనీలలో నందిని పనిచేశారు.

సోషల్ మీడియాలో యాక్టివ్..

అంతేకాకుండా, నందిని అగర్వాల్‌కు యూట్యూబ్‌లో రెండు లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఆమె క్రమం తప్పకుండా CA పరీక్షల గురించి వీడియోలు, అధ్యయన చిట్కాలను షేర్ చేస్తుంది. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలోనూ 74,000 మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో తన పేరు నమోదు కావడంతో ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియాలో షేర్ చేసి తన సంతోషాన్ని పంచుకున్నారు.


Also Read:

Telangana CS Ramakrishna Rao: తెలంగాణ నూతన సీఎస్ నేపథ్యమిదే..

IPS Officers High Court: తెలంగాణ హైకోర్టుకు ముగ్గురు ఐపీఎస్‌లు.. ఎందుకంటే

The Family Man: ఫ్యామిలీ మ్యాన్ నటుడి అనుమానాస్పద మృతి

Updated Date - Apr 29 , 2025 | 04:59 PM