Final Destination: ఫైనల్ డెస్టినేషన్ మూమెంట్.. మహిళపై కూలిపడ్డ సినిమా హాలు పైకప్పు..
ABN , Publish Date - May 26 , 2025 | 02:57 PM
Final Destination Movie: అర్జెంటీనా, లా ప్లాటాకు చెందిన ఫియామా విల్లవర్డే అనే మహిళ సోమవారం ఫైనల్ డెస్టినేషన్ సినిమా చూడ్డానికి ఓచో థియేటర్‌కు వెళ్లింది. అది 7డి హాలు. మామూలు హాలుకంటే ఇది ప్రత్యేకంగా ఉంటుంది.

ఫైనల్ డెస్టినేషన్ సిరీస్‌కు ప్రపంచ వ్యాప్తంగా చాలా క్రేజ్ ఉంది. 2000 సంవత్సరంలో ఫైనల్ డెస్టినేషన్ మొదటి సినిమా విడుదల అయి సూపర్ హిట్ అయింది. ఆ తర్వాతి నుంచి ఇప్పటి వరకు 6 పార్టులుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆరు సినిమాలు అద్భుతమైన విజయాన్ని అందుకున్నాయి. సినిమాలో కథ ఏమీ ఉండదు. భయానక దృశ్యాలు తప్ప. సినిమాలోని పాత్రలు అనుకోని విధంగా.. అత్యంత దారుణంగా చనిపోతూ ఉంటాయి. ఇదే ఆరు సినిమాల్లోని కామన్ కథ. తాజాగా, ఫైనల్ డెస్టినేషన్ ఫ్రాంచైజీ నుంచి 6వ సినిమా విడుదల అయింది.
ఫైనల్ డెస్టినేషన్ : బ్లడ్‌లైన్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా మే 16వ తేదీన విడుదల అయింది. అర్జెంటీనాలో ఈ సినిమా చూస్తుండగా దారుణం చోటుచేసుకుంది. సినిమా హాలు పైకప్పు కుప్పకూలిపోయింది. సినిమా చూస్తున్న మహిళపై పడిపోయింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. అర్జెంటీనా, లా ప్లాటాకు చెందిన ఫియామా విల్లవర్డే అనే మహిళ సోమవారం ఫైనల్ డెస్టినేషన్ సినిమా చూడ్డానికి ఓచో థియేటర్‌కు వెళ్లింది. అది 7డి హాలు. మామూలు హాలుకంటే ఇది ప్రత్యేకంగా ఉంటుంది.
సినిమా చూసే ఎక్స్‌పీరియన్స్‌లో కూడా తేడా ఉంటుంది. ఫియామా ఈ సినిమాకు తన 11 ఏళ్ల కూతురు, కూతురి స్నేహితురాలితో కలిసి వెళ్లింది. క్లైమాక్స్‌లో సౌండ్ ఎఫెక్ట్స్ విపరీతంగా పెరిగాయి. ఆ శబ్ధాలకు హాలు సీలింగ్ ముందు భాగం కుప్పకూలిపోయింది. శిథిలాలు ఫియామా కాలిపై పడ్డాయి. గాయాలు అయ్యాయి. ఆమె గట్టిగా అరవటంతో హాలు సిబ్బంది అక్కడికి వచ్చారు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. అయితే, హాలు పైకప్పు మీద పడ్డంపై వియామా పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. లాయర్‌ను సంప్రదించింది. కోర్టులో కేసు వేయబోతోంది. మరి, ఏం జరుగుతుందో వేచి చూడాలి.
ఇవి కూడా చదవండి
Jyothi Malhotra: జ్యోతి మల్హోత్రాకు ఆరుగురు పాక్ గన్‌మెన్‌ల సెక్యూరిటీ.. సాటి యూట్యూబర్‌కు షాక్
Narendra Modi: మేడిన్ ఇండియా వస్తువులు ఉపయోగించాలి..వారి అభివృద్ధికి పాటు పడాలి