Indian Origin Actor: ఆశీస్సుల పేరుతో నటిని వేధించిన పూజారి
ABN , Publish Date - Jul 10 , 2025 | 12:21 PM
Indian Origin Actor: మలేషియా, సెపాంగ్‌లోని మారియమ్మన్ గుడిలో పూజలు చేసే భారత దేశానికి చెందిన పూజారి భారత సంతతికి చెందిన నటి లిశాల్లిని కనరణ్‌ను వేధించాడు. ఆశీస్సుల పేరుతో ఆఫీసుకు పిలిచి తప్పుగా ప్రవర్తించాడు.

భారత సంతతికి చెందిన నటి లిశాల్లిని కనరణ్‌కు గుడిలో వేధింపులు ఎదురయ్యాయి. మలేషియా, సెపాంగ్‌లోని మారియమ్మన్ గుడిలో పూజలు చేసే భారత దేశానికి చెందిన పూజారి ఆమెను వేధించాడు. ఆశీస్సుల పేరుతో ఆఫీసుకు పిలిచి తప్పుగా ప్రవర్తించాడు. సంఘటన జరిగిన నెల తర్వాత లిశా ఆ వేధింపుల విషయాన్ని బయటపెట్టింది. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్టు పెట్టింది. ఆ పోస్టులో .. ‘చాలా బాధగా ఉంది. మరీ ముఖ్యంగా ఇలాంటి విషయాన్ని పంచుకోవడానికి బాధగా ఉంది.
ఈ విషయం గురించి చెప్పడానికి ఇన్ని రోజులు నాకు ధైర్యం సరిపోలేదు. ఎంతో కష్టం మీద ధైర్యం కూడగట్టుకుని ఇప్పుడు చెబుతున్నాను. నా జీవితంలో ఇప్పటి వరకు నేను మతపరమైన విషయాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. దేవుడ్ని ఎలా ప్రార్థించాలో.. ప్రార్థించే సమయంలో ఏం చేయాలో కూడా నాకు తెలీదు. అయితే, ఈ మధ్యే ఆ విషయాలు నేర్చుకోవడానికి అవకాశం లభించింది. గత కొన్ని వారాలనుంచి గుడికి వెళుతున్నాను. కొంచెం కొంచెంగా అన్ని విషయాలను నేర్చుకుంటున్నాను.
జూన్ 21వ తేదీన మా అమ్మ ఇండియాలో ఉంది. నేను ఒంటరిగా గుడికి వెళ్లాను. ప్రతీరోజూ వెళ్లే గుడికే వెళ్లాను. అక్కడి పూజారి పూజలు ఎలా చేయాలో నాకు చెప్పేవాడు. నాకు వాటి గురించి పెద్దగా తెలీదు కాబట్టి.. అతడి సాయాన్ని మెచ్చుకునే దాన్ని. ఆ రోజు అతడు నా దగ్గరకు వచ్చాడు. పూజలు అయిపోయిన తర్వాత తన ఆఫీస్‌కు రమ్మన్నాడు. చేతికి కంకణం కడతానని చెప్పాడు. నేను వెళ్లాను. అక్కడ నాతో చాలా తప్పుగా ప్రవర్తించాడు. ముందెన్నడూ లేని విధంగా ఎంతో బాధగా అనిపిస్తోంది’అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
ఇవి కూడా చదవండి
భార్య షాపింగ్‌కు వెళ్లిందని చంపేశాడు..
ఉత్తర భారతదేశంలో పలు చోట్ల భూప్రకంపనలు