Actor Tushar: పాపం ఈ నటుడు.. పని దొరకలేదన్న ఆవేదనతో..
ABN , Publish Date - Jun 21 , 2025 | 02:48 PM
Tushar Ghadigaonkar: గత కొన్నేళ్ల నుంచి అతడికి సినిమా అవకాశాలు బాగా తగ్గాయి. దీంతో మానసికంగా చాలా కృంగిపోయాడు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ప్రాణాలు తీసుకున్నాడు.

సినిమా అనే రంగుల ప్రపంచంలో జనాలకు సెలెబ్రిటీల నేమ్, ఫేమ్ మాత్రమే కనిపిస్తుంది. అందుకోసం వారు పడే కష్టం కనిపించదు. సినిమా ప్లాపులు అవుతున్నా.. అవకాశాలు సరిగా రాకపోయినా.. నటీ,నటుల జీవితం నరకంలా మారుతుంది. ఆర్థికంగా, మానసికంగా తీవ్ర మనోవేధనకు గురవుతూ ఉంటారు. అది తట్టుకోవటం అందరి వల్ల కాదు. అందుకే కొంతమంది ప్రాణాలు తీసుకుంటున్నారు. మరికొంత మంది ఇండస్ట్రీని వదిలివెళ్లిపోతున్నారు. తాజాగా, తుషార్ ఘడిగావంకర్ అనే నటుడు సినిమా అవకాశాలు లేక ప్రాణాలు తీసుకున్నాడు.
శుక్రవారం ఈ విషాదం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రకు చెందిన తుషార్ ఘడిగావంకర్ పలు మరాఠీ సినిమాల్లో నటించాడు. మన్ కస్తూరీ రే, బావుబలి, జాంబివ్లీతో పాటు మరికొన్ని సినిమాలు చేశాడు. సినిమాలతో పాటు టీవీ షోలు, థియేటర్ ప్రోగ్రామ్‌లు కూడా చేశాడు. కేవలం నటుడిగానే కాదు.. దర్శకుడిగా కూడా తన సత్తా చాటాడు. ‘తుజి మజి యారీ షో’కు దర్శకత్వం వహించాడు. తన సొంత నిర్మాణ సంస్థనుంచి కొన్ని మ్యూజిక్ వీడియోలు కూడా చేశాడు.
గత కొన్నేళ్ల నుంచి అతడికి సినిమా అవకాశాలు బాగా తగ్గాయి. దీంతో మానసికంగా చాలా కృంగిపోయాడు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ప్రాణాలు తీసుకున్నాడు. తుషార్ మృతితో మరాఠీ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. పలువురు చిత్ర ప్రముఖులు తుషార్ మృతిపై సంతాపం ప్రకటించారు. నటుడు అంకుర్ విఠల్ రావు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్టు పెట్టాడు. ‘ ఓ ఫ్రెండ్.. ఎందుకు ఇలా చేశావు. ప్రతీ సమస్యకు ఆత్మహత్య పరిష్కారం కాదు. తుషార్ ఘడిగావంకర్, నీవు ఓడిపోయావంటే మనమంతా ఓడిపోయినట్లే’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇవి కూడా చదవండి
ఎన్నికల ముందు భారీ పెన్షన్ గిఫ్ట్.. మూడు రెట్లు పెంచిన సీఎం
ప్రజాసమస్యలపై పోరాడండి.. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించండి