Manju Pathrose: కిడ్నీ అమ్మాలనుకున్న ప్రముఖ నటి.. కారణం ఏంటంటే..
ABN , Publish Date - Jun 25 , 2025 | 09:46 PM
Manju Pathrose: ప్రముఖ మలయాళ నటి మంజు పాథ్రోస్ ఒకానొక దశలో తీవ్రమైన ఆర్ధిక కష్టాలు ఎదుర్కొంది. ఆ కష్టాల కారణంగా కిడ్నీ కూడా అమ్మాలనుకుంది. ప్రాణాలు కూడా తీసుకోవాలని అనుకుంది.

డబ్బు అవసరం మాత్రమే కాదు.. అంతకు మించి.. మనిషి జీవితంలో వచ్చే 99 శాతం కష్టాలకు పరిష్కారం కేవలం డబ్బు మాత్రమే. అయితే, కుబేర సినిమా ఈవెంట్‌లో ధనుష్ చెప్పినట్లు .. 100 రూపాయలు సంపాదించే వాడికి 200 రూపాయల కష్టాలు ఉంటాయి. కోటి రూపాయలు సంపాదించే వాడికి రెండు కోట్ల కష్టాలు ఉంటాయి. ఆయన ఉద్దేశ్యంలో ఆ కష్టాలు డబ్బు లేక వచ్చేవి కావు.. డబ్బు వల్ల వచ్చేవి. ఈ ప్రపంచంలో డబ్బు వల్ల కష్టపడేవారికంటే.. డబ్బు లేక కష్టపడేవారే ఎక్కువ.
అందులో ఇప్పుడు స్టార్లుగా నేమ్, ఫేమ్ తెచ్చుకున్న వారు కూడా ఉన్నారు. ప్రముఖ మలయాళ నటి మంజు పాథ్రోస్ ఒకానొక దశలో తీవ్రమైన ఆర్ధిక కష్టాలు ఎదుర్కొంది. ఆ కష్టాల కారణంగా కిడ్నీ కూడా అమ్మాలనుకుంది. ప్రాణాలు కూడా తీసుకోవాలని అనుకుంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమే వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ..‘డబ్బు లేకుండా ఎవరూ జీవించలేరు. పెళ్లి తర్వాత జీవితం మనం ఊహించినట్లుగా ఉండదు. మనకు గౌరవం కావాలి, ప్రేమ కావాలి, అన్నీ కావాలి. అన్నిటికంటే ముఖ్యంగా డబ్బు కావాలి.
డబ్బు లేకుండా మనం జీవించలేము. నేను చాలా దారుణమైన ఆర్ధిక కష్టాలు చూశాను. ఒకానొక దశలో నా కిడ్నీ కూడా అమ్ముదామని అనుకున్నాను. చావాలని కూడా అనుకున్నాను. కానీ, నా కొడుకు, తల్లిదండ్రులు, స్నేహితుల గురించి ఆలోచించి నా నిర్ణయాన్ని మార్చుకున్నాను. ప్రతీ మనిషి తన జీవితంలో ఇలాంటి కష్టాలను అనుభవించే తీరతాడు. కష్టాల సమయంలో సాయం చేసే చెయ్యి లేకపోతే నరకంలా ఉంటుంది. నేను పిరికి దాన్ని కావచ్చు. అందుకే చనిపోదామని చాలా సార్లు అనుకున్నా. ఏం చేయాలో తెలియక వెక్కి వెక్కి ఏడ్చిన రోజులు చాలా ఉన్నాయి’అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
ఇవి కూడా చదవండి
ఒబామా ఖమేనీ ముందు తలవంచాడా.. ఆ ఫొటోలో నిజం ఎంత..
ఓయోలో ప్రియుడితో భార్య డ్యాన్స్.. ఆ వీడియో చూసి తట్టుకోలేక..