Zomato delivery boy: కస్టమర్ ఫుడ్ తినేస్తున్న డెలివరీ బాయ్.. అసలు విషయం తెలిస్తే షాకవ్వాల్సిందే..
ABN , Publish Date - Mar 17 , 2025 | 02:52 PM
కొందరు డెలివరీ బాయ్స్ వినియోగదారుల ఫుడ్ తినేస్తున్నారని పలు ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా అలాంటిదే ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే దాని వెనుక కథను తలుచుకుంటే మాత్రం కళ్లు చెమర్చక తప్పదు.

ఫుడ్ డెలివరీ బాయ్స్ (Food Delivery Boys) కాలంతో సంబంధం లేకుండా ఎండైనా, వానైనా, చలిలోనైనా తమ పనిని కొనసాగించాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగదారులకు సకాలంలో ఫుడ్ అందించి వారి ఆకలి తీర్చాల్సిందే. తమ ఆకలిని పట్టించుకోకుండా పని చేస్తేనే కుటుంబ సభ్యుల ఆకలిని తీర్చగలరు. ఆ క్రమంలో కొందరు డెలివరీ బాయ్స్ వినియోగదారుల ఫుడ్ తినేస్తున్నారని పలు ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా అలాంటిదే ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే దాని వెనుక కథను తెలుసుకుంటే మాత్రం కళ్లు చెమర్చక తప్పదు (Viral News).
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కిరణ్ వర్మ షేర్ చేసిన పోస్ట్ ప్రకారం.. నోయిడాలో హోలీ రోజు సాయంత్రం 5 గంటలకు ఓ జొమాటో (Zomato) డెలివరీ బాయ్ కార్ పార్కింగ్ ఏరియాలో ఫుడ్ పార్సిల్ ఓపెన్ చేసి తినేస్తున్నాడు. కస్టమర్ ఫుడ్‌ను డెలివరీ బాయ్ తింటున్నట్టు భావించిన కిరణ్ వర్మ ఫొటో తీశాడు. ఆ తర్వాత అతడితో మాటలు కలిపాడు. మాటల్లో అసలు విషయం తెలుసుకున్నాడు. ముందు ఆ డెలివరీ బాయ్‌తో వర్మ మాట్లాడుతూ.. సాయంత్రం ఐదు గంటల వరకు లంచ్ చేయకపోవడానికి గల కారణమేంటని అడిగాడు. *సర్, నేను మధ్యాహ్నం రెండు గంటలకు ఈ ఆర్డర్ తీసుకున్నాను. ఫుడ్‌ను డెలివరీ చేయడానికి వెళ్లాను. ఎంతసేపు వెయిట్ చేసినా అక్కడకు ఎవరూ రాలేదు* అని డెలివరీ బాయ్ చెప్పాడు.
ఎంతసేపు వెయిట్ చేసినా ఎవరూ రాకపోవడంతో ఆ ఫుడ్ డెలివరీ అయినట్టుగా మార్క్ చేయాలని ఎగ్జిక్యూటివ్‌కు చెప్పానని ఆ డెలివరీ బాయ్ చెప్పాడు. అలా మార్క్ చేస్తే జొమాటో రూల్స్ ప్రకారం ఆ ఫుడ్‌ను డెలివరీ బాయ్ ఏమైనా చేయవచ్చు. అలా ఆ ఫుడ్‌ను తాను తీసుకున్నానని డెలివరీ బాయ్ చెప్పాడు. హోలీ కావడంతో లంచ్ సమయంలో ఎక్కువ ఆర్డర్లు వచ్చాయని, ఆ సమయంలో తన లంచ్ కోసం సమయం వృథా చేయకుండా ఫుడ్ పార్సిల్స్ డెలివరీ చేశానని చెప్పాడు. దాంతో సాయంత్రం లంచ్ చేస్తున్నానని ఆ డెలివరీ బాయ్ తెలిపాడు. ఎంతో కష్టపడితే నెలకు రూ.20 నుంచి 25 వేల వరకు సంపాదిస్తానని తెలిపాడు.
ఇవి కూడా చదవండి..
Reliance: ఇల్లు సర్దుతుండగా దొరికిన పాత కాగితాలు.. ఇప్పుడు వాటి విలువ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే..
Jugaad Video: ఈ బోరు ఇలా ఉందేంటబ్బా.. నీరు బయటకు ఎలా వస్తోందో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
Optical Illusion Test: ఈ గదిలో స్పైడర్‌ను 10 సెకెన్లలో కనిపెడితే.. మీ కళ్లు షార్ప్ అని తెలుసుకోండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి.