Share News

Wifes Dance Video: ఓయోలో ప్రియుడితో భార్య డ్యాన్స్.. ఆ వీడియో చూసి తట్టుకోలేక..

ABN , Publish Date - Jun 25 , 2025 | 08:41 PM

Wifes Dance Video: తన చావుకు భార్య, ఆమె ప్రియుడే కారణమని తెలిపాడు. వారిద్దరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. కొడుకును తన తల్లిదండ్రులకు అప్పగించాలని కోరాడు.

Wifes Dance Video: ఓయోలో ప్రియుడితో భార్య డ్యాన్స్.. ఆ వీడియో చూసి తట్టుకోలేక..
Wifes Dance Video

భార్య చేసిన పనికి ఓ భర్త ప్రాణాలు తీసుకున్నాడు. బరితెగించిన ఆ భార్య.. ఓయోలో ప్రియుడితో ఉన్నపుడు తీసిన వీడియోను భర్తకు పంపింది. ఆ వీడియో చూసి భర్త తట్టుకోలేకపోయాడు. సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన హర్యానాలోని రోహ్‌తక్‌‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హర్యనా, రోహ్‌తక్‌‌కు చెందిన మగన్, దివ్య భార్యాభర్తలు. అయితే, దీపక్ అనే పోలీస్ ఇన్‌స్పెక్టర్‌తో దివ్య సంబంధం పెట్టుకుంది. ఇద్దరూ తరచుగా ఓయోలో కలుసుకునే వారు.


దీపక్‌తో సంబంధం పెట్టుకున్న తర్వాత మగన్‌ను దివ్య మానసికంగా వేధించేది. దీపక్‌కు సంబంధించిన విషయాలు చెప్పి టార్చర్ పెట్టేది. కొద్దిరోజుల క్రితం దివ్య, దీపక్‌లు ఓయోకు వెళ్లారు. ఓయో రూములో ప్రియుడితో ఉండగా దివ్య డ్యాన్స్ చేసింది. ఆమె డ్యాన్స్ చేస్తూ ఉంటే.. దాన్ని దీపకే స్వయంగా సెల్ఫీ వీడియో తీశాడు. ఆ వీడియోను దివ్య తన భర్తకు పంపింది. ఆ వీడియో చూసి అతడు తట్టుకోలేకపోయాడు. తనకు చావే శరణ్యం అనుకున్నాడు.


చనిపోవడానికి ముందు ఓ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. తన చావుకు భార్య, ఆమె ప్రియుడే కారణమని తెలిపాడు. వారిద్దరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. కొడుకును తన తల్లిదండ్రులకు అప్పగించాలని కోరాడు. తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం దివ్య డ్యాన్స్ వీడియోతో పాటు, మగన్ సెల్ఫీ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు దివ్య, దీపక్‌లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

చదవటం లేదని శిక్ష.. ఊహించని నిర్ణయం తీసుకున్న బాలిక

ప్లేటు ఫిరాయించిన అమెరికా.. అప్పుడు సాయం.. ఇప్పుడు దాడులు

Updated Date - Jun 25 , 2025 | 09:08 PM