Share News

Blue Label Dating App Scam: యువకుడి కొంప ముంచిన యువతి.. బార్‌కు తీసుకెళ్లి..

ABN , Publish Date - Oct 12 , 2025 | 07:03 PM

అతడు బీరు, వోడ్కా ఆర్డర్ చేశాడు. వాటిని తాగి సరిపెట్టుకున్నాడు. ఆమె మాత్రం ఖరీదైన మందు ఆర్డర్ చేసుకుని తాగుతూనే ఉంది. అలా కరోనా ఎక్స్‌ట్రా పింట్, అబ్సొల్యూట్, బ్లూ లేబుల్ లాంటి మందు ఆర్డర్ చేసుకుని తాగింది. చివరికి..

Blue Label Dating App Scam: యువకుడి కొంప ముంచిన యువతి.. బార్‌కు తీసుకెళ్లి..
Blue Label Dating App Scam

ఇంటర్నెట్ డెస్క్: డేటింగ్ యాప్‌లో పరిచయమైన ఓ యువతి యువకుడి కొంప ముంచింది. అతడ్ని బార్‌కు తీసుకెళ్లి అరాచకం సృష్టించింది. ఖరీదైన మందు తాగి 25 వేల దాకా బిల్ చేసి పరారైంది. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో చోటుచేసుకుంది. సదరు బాధితుడు తాను మోసపోయిన విషయాన్ని రెడ్డిట్ ద్వారా నెటిజన్లకు చెప్పుకుని బాధపడ్డాడు. ఆ వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన బాధితుడికి ఓ డేటింగ్ యాప్‌ ద్వారా ప్రియాంక అనే అమ్మాయితో పరిచయం అయింది. కొంతకాలం ఇద్దరూ చాటింగ్ చేసుకున్నారు. ఫోన్‌లో మాట్లాడుకున్నారు.


రెండు రోజుల క్రితం రాత్రి థానేలో ప్రియాంకను కలిశాడు. ఆమె అతడ్ని ‘పాబ్లో బార్’కు తీసుకువెళ్లింది. అతడు బీరు, వోడ్కా ఆర్డర్ చేశాడు. వాటిని తాగి సరిపెట్టుకున్నాడు. ఆమె మాత్రం ఖరీదైన మందు ఆర్డర్ చేసుకుని తాగుతూనే ఉంది. అలా కరోనా ఎక్స్‌ట్రా పింట్, అబ్సొల్యూట్, బ్లూ లేబుల్ లాంటి మందు ఆర్డర్ చేసుకుని తాగింది. తర్వాత మెల్లగా అక్కడినుంచి జారుకుంది. ఆమె తాగిన మందు తాలూకా బిల్ చూసి అతడు షాక్ అయ్యాడు. బిల్లు రూ.24వేలకు పైనే వచ్చింది. బరువెక్కిన గుండెతో బిల్లు కట్టేసి అక్కడినుంచి వచ్చేశాడు.


తనలాంటి తప్పు ఇంకెవరూ చేయకూడదని అంటూ రెడ్డిట్‌లో ఎమోషనల్ పోస్టు పెట్టాడు. డేటింగ్ యాప్‌లోని ప్రియాంక ప్రోఫైల్ స్క్రీన్ షాట్ కూడా పెట్టాడు. ఆ పోస్టు కాస్తా వైరల్‌గా మారింది. వైరల్ పోస్టుపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఇలాంటి వారు సమాజంలో చాలా మంది ఉన్నారు. మోసం చేయడానికే మనతో స్నేహం చేస్తారు. ప్రేమ నటిస్తారు. నిండా ముంచేసిపోతారు’..‘డేటింగ్ యాప్‌లో అమ్మాయిలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఇలా మోసం పోవటం ఖాయం’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

REDDIT.jpg


ఇవి కూడా చదవండి

కానిస్టేబుళ్ల సాహసం.. సముద్రంలోకి వెళ్లి నలుగురిని కాపాడారు

పనివాడి ప్రాణాలు పోతున్నా పట్టించుకోని యజమాని..

Updated Date - Oct 12 , 2025 | 08:32 PM