Share News

Viral News: వావ్.. మహిళను వరించిన అదృష్టం.. రెండేళ్ల తర్వాత..

ABN , Publish Date - Jun 24 , 2025 | 05:35 PM

ఓ మహిళను అదృష్టం వరించింది. గత రెండేళ్లుగా వజ్రం కోసం శ్రమిస్తున్న ఆమెకు ఎట్టకేలకు ఫలితం లభించింది. ఎంతో విలువైన వజ్రం దొరికింది. మరి ఆ వజ్రం విలువ ఎంత ఉంటుంది.. ఆ వజ్రం కథ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం..

Viral News: వావ్.. మహిళను వరించిన అదృష్టం.. రెండేళ్ల తర్వాత..
Diamond

మధ్యప్రదేశ్‌: కొన్ని ప్రాంతాల్లో వర్షాకాలం వచ్చిందంటే వజ్రాల కోసం వేట మొదలవుతుంది. తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు తెగ ప్రయత్నాలు చేస్తారు. కొందరు తిండి తిప్పలు మానేసి అదే పనిగా వజ్రాల కోసం అన్వేషిస్తుంటారు. ఒక్క వజ్రం దొరికితే చాలు దెబ్బకు జీవితం సెట్ అవుతుందుని తెగ ప్రయాస పడుతుంటారు. వజ్రాల కోసం వెతకడం అనేది అంత ఈజీ ఏమీ కాదు. వజ్రాలు వెతకడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. అయితే, మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలో చోప్రా ప్రాంతానికి చెందిన సావిత్రి సిసోడియా వజ్రాల కోసం ప్రభుత్వం నుండి కొంత భూమిని (గని) లీజుకు తీసుకుంది. గత రెండు సంవత్సరాలుగా మండుతున్న ఎండ, దుమ్ము, ధూళిని పట్టించుకోకుండా వజ్రం కోసం వెతుకుతూనే ఉంది. అయితే, ఎట్టకేలకు ఆ మహిళను అదృష్టం వరించింది.


రెండేళ్లుగా శ్రమిస్తూ వచ్చిన ఆమెకు లక్షల రూపాయల విలువగల వజ్రం లభ్యమైంది. ఆమెకు ఇటీవల 2.69 క్యారెట్ల వజ్రం దొరికింది. ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించిన గనుల శాఖ అధికారి అనుపమ్ సింగ్, వజ్రాన్ని తాత్కాలికంగా ప్రభుత్వ కస్టడీలోకి తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నిర్వహించే వేలంలో ఈ వజ్రాన్ని అమ్మిన తర్వాత నిబంధనల ప్రకారం పన్నులు, రాయల్టీలు మినహాయించి మిగిలిన మొత్తాన్ని సావిత్రికి అందజేస్తామని తెలిపారు.


ఇక సావిత్రి మాట్లాడుతూ..ఇది నా జీవితంలోనే గొప్ప దశ. ఎన్నో కష్టాలు పడ్డాను. చివరికి ఆ దేవుడు ఊహించని కానుక ఇచ్చారు అని ఆనందం వ్యక్తం చేసింది. కాగా, పన్నా ప్రాంతం భారతదేశంలో వజ్రాలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ తరచుగా విలువైన వజ్రాలు దొరుకుతాయని స్థానికులు చెబుతుంటారు.


Also Read:

బద్దకానికి కారణమయ్యే ఆహారాలు ఇవే..

ఇంట్లో ఈ చోట్ల టీవీ పెడితే డేంజర్.. షార్ట్ సర్క్యూట్‌తో పేలిపోవచ్చు..

For More Viral News

Updated Date - Jun 24 , 2025 | 06:20 PM